Keerthi Suresh విధాత: తారలు సినీరంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం అనేది మామూలుగా జరిగేదే.. వాళ్ళకున్న క్రేజ్ దృష్ట్యా ప్రజల్లోకి చురుగ్గా దూసుకుపోతారనేది ఒక కారణం అయితే.. ఎప్పుడూ సినిమాలతో ప్రజల్లోనే ఉంటారు.. కనుక వాళ్ళకు ఇట్టే దగ్గరై, మనసులు గెలుచుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే సినీతారలు ఎక్కువగా రాజకీయాల మీద మక్కువ చూపిస్తూ ఉంటారు. అగ్ర తారలుగా ఉన్నవారిలో చాలామంది సినీ రంగం నుంచి రాజకీయ రంగం వైపుకు వచ్చి సక్సెస్ […]
Keerthi Suresh
విధాత: తారలు సినీరంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం అనేది మామూలుగా జరిగేదే.. వాళ్ళకున్న క్రేజ్ దృష్ట్యా ప్రజల్లోకి చురుగ్గా దూసుకుపోతారనేది ఒక కారణం అయితే.. ఎప్పుడూ సినిమాలతో ప్రజల్లోనే ఉంటారు.. కనుక వాళ్ళకు ఇట్టే దగ్గరై, మనసులు గెలుచుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ కారణంగానే సినీతారలు ఎక్కువగా రాజకీయాల మీద మక్కువ చూపిస్తూ ఉంటారు. అగ్ర తారలుగా ఉన్నవారిలో చాలామంది సినీ రంగం నుంచి రాజకీయ రంగం వైపుకు వచ్చి సక్సెస్ కొట్టినవారున్నారు. మంత్రులుగా, ముఖ్య మంత్రులుగా ఏలిన వారూ ఉన్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే..
ఈమధ్య కాలంలో సినీ తారగా అడుగుపెట్టి అగ్ర హీరోల చెంతన నటించి మెప్పించిన కీర్తి సురేష్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందట. సినిమాల పరంగా కీర్తి ఫుల్ జోష్ మీద ఉంది. మంచి పేరుతో పాటు రాబోతున్న ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉంది. ఈమధ్య కాలంలో వచ్చిన ‘దసరా’ సినిమాతో ‘మహానటి’ తర్వాత మరో భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్ళను తెచ్చిపెట్టింది.
అయితే కీర్తి సినిమాలను వదలి రాజకీయాలవైపు వస్తుంది అనేందుకు తాజాగా కీర్తి చేసిన వ్యాఖ్యలే సాక్ష్యాలుగా నిలిచాయి. తమిళ చిత్రం ఉదయనిధి స్టాలిన్ హీరోగా, వడివేలు ముఖ్య పాత్రలో చేసిన ‘మామన్నన్’ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం జూన్ 29న గ్రాండ్‌గా విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది.
సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి.. ‘అందరూ పాలిటిక్స్‌లోకి వస్తున్నారా? అని అడుగుతున్నారు. దాని గురించి ఆలోచించాలి’ అని మాట్లాడింది. అంటే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందన్నట్టే మాట్లాడటం ఆసక్తిగా మారాయి.
గతంలో ఒకసారి కూడా ఇలాంటి వార్తలే వచ్చినప్పుడు ఆమె తల్లి మేనకా సురేష్ నిజంలేదని తెలిపింది. ఇప్పుడు ఆమె మాటలు వింటుంటే.. మనసులో ఏదో ఒక మూల ఆ కోరిక ఉన్నట్లే కనిపిస్తుందనేలా ఇప్పుడు టాక్ మొదలైంది.
ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయ ప్రవేశం చేయనున్నారనే ప్రచారం కాస్త జోరుగానే సాగుతుంది. ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలనే సిద్ధం అవుతున్నారట.
జయలలిత, జమున, జయప్రద ఇలా చాలామంది హీరోయిన్స్‌గా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఓ వెలుగు వెలిగారు. మరి కీర్తి కూడా అలాంటి లక్కీ ఛాన్స్ కొట్టేస్తుందేమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.