నిద్ర‌కు ముందు నీళ్లు తాగాలా.. వద్దా? నిపుణుల సూచ‌నలివే!

ఎప్పుడు తాగాలి ? ఎలా తాగాలి ? విధాత: కడుపునిండా తిండి, చేతి నిండా పని, కంటి నిండా నిద్ర వీటిని మించిన అదృష్టం మరోటి లేదంటారు. ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. గాడ్జెట్స్, కెఫిన్ వాడకం పెరగడం వంటి రకరకాల కారణాలున్నాయి నిద్ర‌లేమికి. అందుకే పడుకునే ముందు బ్రౌసింగ్ చెయ్యడం కంటే పుస్తకం చదువుకోవడం, మెడిటేషన్ చెయ్యడం వంటివి అలవాటు చేసుకోవడం మంచిదని స్లీప్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే.. మంచి నిద్రకు […]

  • By: krs    health    Nov 17, 2022 6:38 AM IST
నిద్ర‌కు ముందు నీళ్లు తాగాలా.. వద్దా? నిపుణుల సూచ‌నలివే!

ఎప్పుడు తాగాలి ? ఎలా తాగాలి ?

విధాత: కడుపునిండా తిండి, చేతి నిండా పని, కంటి నిండా నిద్ర వీటిని మించిన అదృష్టం మరోటి లేదంటారు. ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. గాడ్జెట్స్, కెఫిన్ వాడకం పెరగడం వంటి రకరకాల కారణాలున్నాయి నిద్ర‌లేమికి. అందుకే పడుకునే ముందు బ్రౌసింగ్ చెయ్యడం కంటే పుస్తకం చదువుకోవడం, మెడిటేషన్ చెయ్యడం వంటివి అలవాటు చేసుకోవడం మంచిదని స్లీప్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

నిపుణులు ఏమంటున్నారంటే..

మంచి నిద్రకు చెయ్యాల్సినవి చెయ్యకూడని పనుల గురించిన అనుమానాలు ఎప్పుడూ ఉండేవే. అలాంటి వాటిలో ఒకటి నిద్రకు ముందు నీళ్లు తాగాలా? వద్దా? అనేది కూడా ఒకటి. కొంత మంది తాగాలని అంటే మరికొందరు వద్దని అంటారు. అసలు నిపుణులు దీని గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం. నిద్రకు ముందు నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుందని నిపుణుల అభిప్రాయం. నిద్రలో శరీరంలో తేమ తగ్గితే ఉష్ణోగ్రతలో తేడా వస్తుందట. కాబట్టి నిద్రకు ముందు ఒక గ్లాసు నీళ్లు తాగటం మ‌ర‌చిపోవ‌ద్ద‌ని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్.

సౌక‌ర్యంగా ఉండాలి

నిద్ర చెదిరిపోకుండా ఉండాలంటే శ‌రీరం సౌకర్యంగా ఉండాలని అధ్యయనాలు చెబుతున్నాయి. 2014 లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అనే జర్నల్ లో శరీరంలో నీళ్ల శాతం తగ్గితే మానసిక స్థితి మీద నెగెటివ్ ప్రభావం పడతుందని, అది పూర్తి నిద్ర పట్టే విధానం మీద ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనం నిర్ధారిస్తోంది. అంటే నిద్రకు ముందే ఎక్కువ నీళ్లు తాగమని కాదు కానీ కొద్దిగా నీళ్లు తాగి పడుకుంటే, శ‌రీర ఉష్ణోగ్ర‌త స‌మ‌తుల్య‌త‌లో ఉండి చ‌క్క‌టి నిద్ర ప‌డుతుంద‌ని నిపుణుల అభిప్రాయం.

ఆ రెండూ ఆరోగ్యానికి ప్ర‌మాద‌మే..

నిద్రకు ముందు నీళ్లు లేదా మరేవైనా ద్రవపదార్థాలు కానీ ఎక్కువగా తీసుకుంటే మూత్ర విసర్జన కోసం మధ్యలో లేవాల్సి వ‌స్తుంది. లేదా చాలా సమయం పాటు మూత్రం ఆపుకోవాల్సి వస్తుంది. ఇవి రెండూ ఆరోగ్యానికి ప్ర‌మాదక‌ర‌మే. ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఎలాంటి అంతరాయం లేని నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మధ్యలో మూత్ర విసర్జన కోసం మేల్కోవడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితి ఉంటే ఫర్వాలేదు. కానీ ప్రతిరోజు ఇలా నిద్ర డిస్టర్బ్ అయితే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది దీర్ఘకాలంలో గుండె సంబంధ అనారోగ్యాలకు కారణం కావచ్చు అని కూడ హెచ్చిరిస్తున్నారు.

అర‌గంట ముందే..

అందుకే నిద్రకు ఉపక్రమించే ముందు నీళ్లు తాగడం కంటే ఒక అరగంట ముందు నీళ్లు తాగడం మంచిది. దీనివ‌ల్ల‌ డీహైడ్రేషన్ సమస్య రాక‌పోవ‌డ‌మే కాకుండా, నిద్రకు అంతరాయం క‌ల‌గ‌దు. అంతేకాదు అర‌గంట ముందే నీళ్లు తాగి ఉంటాము కావున మూత్ర విసర్జన తర్వాత నిద్రపోవడం మంచిది.

వేడి నీళ్ల‌తో ఉప‌యోగాలు..

నిద్రకు ముందు గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేట్ కాకుండా ఉండొచ్చు. అంతేకాకుండా సహజంగా డీటాక్సిఫికేషన్ కు ఇది తోడ్పడుతుంది. గోరు వెచ్చని నీళ్లు మంచి రక్త ప్రసరణకు కూడా దోహదం చేస్తాయి. శరీరం నుంచి చెమట కూడా ఎక్కువగా వస్తుంది. ఫలితంగా చర్మ కణాలు శుభ్రపడుతాయి.