ఈ సుగంధ ద్రవ్యాలతో.. ఆ సమస్యలు దూరం చేసుకోండి..

విధాత: శృంగార జీవితం ఒక గొప్ప అనుభూతి. ఇద్దరు భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. బంధాన్ని బలోపేతం చేస్తుంది. అంతటి గొప్ప కార్యం ఈ శృంగారం. మరి అలాంటి శృంగారాన్ని కొందరు ఎంజాయ్ చేయలేకపోతుంటారు. శీఘ్ర స్కలనం, అంగస్తంభనతో పాటు పలు సమస్యలతో సతమతమవుతూ భావప్రాప్తి పొందలేక పోతుంటారు. అలాంటి వారికి మీ వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలే.. శృంగార జీవితానికి దివ్య ఔషధాలు అన్న విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. యాలకులు, లవంగాలు, కుంకుమపువ్వు, మెంతులు మీ […]

  • By: krs    health    Nov 03, 2022 11:56 PM IST
ఈ సుగంధ ద్రవ్యాలతో.. ఆ సమస్యలు దూరం చేసుకోండి..

విధాత: శృంగార జీవితం ఒక గొప్ప అనుభూతి. ఇద్దరు భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. బంధాన్ని బలోపేతం చేస్తుంది. అంతటి గొప్ప కార్యం ఈ శృంగారం. మరి అలాంటి శృంగారాన్ని కొందరు ఎంజాయ్ చేయలేకపోతుంటారు.

శీఘ్ర స్కలనం, అంగస్తంభనతో పాటు పలు సమస్యలతో సతమతమవుతూ భావప్రాప్తి పొందలేక పోతుంటారు. అలాంటి వారికి మీ వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలే.. శృంగార జీవితానికి దివ్య ఔషధాలు అన్న విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. యాలకులు, లవంగాలు, కుంకుమపువ్వు, మెంతులు మీ శృంగార జీవితానికి ఎంతో మేలు చేస్తాయి.

యాలకులు..

శృంగార జీవితానికి యాలకులు ఒక శక్తివంతమైన మందు అని చెప్పవచ్చు. యాలకులు శృంగార జీవితంలో ఏర్పడే అపశృతులను తొలగిస్తాయి. లైంగిక సమస్యలను దూరం చేస్తాయి. పడక గదిలో ఏర్పడే వత్తిడులను తగ్గించి మంచి మూడ్‌ను యాలకులు తీసుకువస్తాయి. అంతేకాకుండా వీర్యంలో శుక్రకణాల వృద్దికి తోడ్పడుతాయి.

శీఘ్రస్ఖలనం, నపుంసకత్వం లాంటి లైంగిక సమస్యలను అడ్డుకోవడంలో అద్బుతంగా పని చేస్తుంది. సంభోగంలో ఎక్కువసేపు పాల్గొనే శక్తిని రెట్టింపు చేస్తాయి.అందువల్ల రోజూ యాలకులు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల శృంగార పరమైన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందులో విటమిన్స్ తో పాటు ఫైబర్, జింక్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం లాంటి అనేక పోషక పదార్దాలు ఉన్నాయి.

లవంగాలు..

ముఖ్యంగా పురుషులలైంగిక సమస్యలను పరిష్కరించడంలో లవంగాలు బాగా పని చేస్తాయి.శృంగార జీవితాన్ని మెరుగుపరచడంలో లవంగం నూనె బాగా ఉపయోగపడుతుంది. పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడంలో లవంగం నూనె సహాయపడుతుంది. వీర్యకణాల సంఖ్యను పెంచడంతో పాటు శీఘ్ర స్కలన సమస్యలను తగ్గిస్తుంది. లవంగ నూనెను వాడడం వల్ల పురుషుల్లో లైంగిక సమస్యలు తొలగిపోతాయి. లవంగం ఎసెన్షియల్ ఆయిల్‌ను ఉపయోగించడం వల్ల వంధ్యత్వ సమస్యలను చాలా వరకు అధిగమించవచ్చు. ఎక్కువ సేపు శ‌ృంగారాన్ని ఆస్వాదించవచ్చు.

కుంకుమ పువ్వు..

అంగ‌స్తంభ‌న, వీర్య క‌ణాలు తక్కువ ఉన్న‌వారు రోజూ కుంకుమ పువ్వును తీసుకోవ‌డం వ‌ల్ల స‌త్ఫ‌లితాలు క‌నిపిస్తాయి. బాదం పాల‌ల్లో కుంకుమ పువ్వును క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల సెక్స్ సామ‌ర్థ్యంతో పాటు సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంది.

మెంతులు..

మెంతులు, మెంతుకూర తినడం వల్ల కూడా.. మహిళల్లో శృంగార భావనలు అధికంగా కలుగుతాయి.అంతేకాకుండా.. ఈ కోరికలు కూడా బాగా పెరుగుతాయట. తద్వారా వారు పడక గదిలో రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.

ఇంగువ..

మనలో చాలా మంది వంటల్లో ఇంగువను ఉపయోగిస్తారు. దాని వాసన బాగుంటుందని.. అది వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుందని భావిస్తుంటారు. అయితే… ఇది మహిళల్లో శృంగార భావనలు కలిగించడానికి సహాయం చేస్తాయి. దీనిని వేసిన వంటలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.