నగ్నంగా నిద్రిస్తే ఆరోగ్యమా?

విధాత: చలి కాలం వచ్చిందంటే చాలు చాలా మందిని రకరకాల అనారోగ్యాలు వేధిస్తూనే ఉంటాయి. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించుకునే ప్రహసనంలో శరీరం కొంచెం ఎక్కువే శ్రమించాల్సి వస్తుంది. అందువల్ల ఇమ్యునిటీ కొద్దిగా తగ్గుతుంది. ఫలితంగా జలుబు, ఫ్లూ వంటివి వేధిస్తుంటాయి. వాతావరణ మార్పుల వల్ల ఇదంతా చాలా సహజమైన విషయమే. రాత్రుళ్లు మరింత వెచ్చగా పడుకోవాలని అనుకుంటాం. అందుకని మరిన్ని ఎక్కువ లేయర్లలో దుస్తులు కూడా ధరిస్తాం. అయతే ఇక్కడ ఒక స్లీప్ ఎక్స్ పర్ట్ […]

  • By: krs    health    Nov 11, 2022 5:29 PM IST
నగ్నంగా నిద్రిస్తే ఆరోగ్యమా?

విధాత: చలి కాలం వచ్చిందంటే చాలు చాలా మందిని రకరకాల అనారోగ్యాలు వేధిస్తూనే ఉంటాయి. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించుకునే ప్రహసనంలో శరీరం కొంచెం ఎక్కువే శ్రమించాల్సి వస్తుంది. అందువల్ల ఇమ్యునిటీ కొద్దిగా తగ్గుతుంది. ఫలితంగా జలుబు, ఫ్లూ వంటివి వేధిస్తుంటాయి.

వాతావరణ మార్పుల వల్ల ఇదంతా చాలా సహజమైన విషయమే. రాత్రుళ్లు మరింత వెచ్చగా పడుకోవాలని అనుకుంటాం. అందుకని మరిన్ని ఎక్కువ లేయర్లలో దుస్తులు కూడా ధరిస్తాం. అయతే ఇక్కడ ఒక స్లీప్ ఎక్స్ పర్ట్ ఏమంటున్నారంటే రాత్రుళ్లు ఎక్కువ దుస్తులతో కాదు నగ్నంగా నిద్ర పోవడం మంచిదని. మీరు చదివింది కరెక్టే. ఆ వివరాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

స్లీప్ సైకాలజిస్ట్ డాక్టర్ కేథరీన్ హాల్ నగ్నంగా నిద్ర పోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. నగ్నంగా నిద్ర పోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుందట. నైట్ పైజామాలు, సాక్సుల వంటివి రక్త ప్రసరణకు కొద్ది మొత్తంలో అడ్డంకులు ఏర్పరచ వచ్చు. మంచి రక్త ప్రసరణ గుండె, కండరాల ఆరోగ్యానికి చాలా అవసరం. అంతేకాదు అడ్డంకులు లేని రక్త ప్రసరణ అంటే శరీరంలోని అన్ని అవయవాలకు మరింత ఆరోగ్యం అని అర్థం.

అంతేకాదు నగ్నంగా నిద్రించడం శరీర ఉష్ణోగ్రతను కూడా సంతులన పరుస్తుందట. ఫ్లూ లేదా జలుబు వంటివి ఉన్నపుడు కచ్చితంగా శరీర ఉష్ణోగ్రత కాస్త ఎక్కువగానే నమోదవుతుంది. అలాంటి సందర్భాల్లో బాడీ టెంపరేచర్ రేగ్యులేట్ చెయ్యడం అవసరం కూడా. స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఇలా నిద్రించడం ఆరోగ్యకరం అని డాక్టర్ హాల్ అంటున్నారు. ఇన్సోమ్నియా సమస్యకు కూడా ఇది మంచి పరిష్కారమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. నగ్నంగా నిద్రించడం వల్ల పురుషుల్లో ఫెర్టిలిటి పెరుగుతుందట. స్త్రీలలో అసౌకర్యంగా ఉండే లోదుస్తుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల బెడద ఉండదట.

దుస్తులు లేకపోవడం వల్ల స్కిన్ ఆన్ స్కిన్ కాంటాక్ట్ వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్యాలను ఎదుర్కొనే శక్తి సహజంగానే శరీరం సంతరించుకుంటుందని డాక్టర్ హాల్ అంటున్నారు. సీసనల్ ఎఫెక్టివ్ డిజార్డర్(SAD) అనే మానసిక స్థితి కూడా ఏర్పడదు అని కూడ అంటున్నారు.

సంవత్సరంలో మిగతా అన్ని సీజన్లలో మామూలుగానే ఉండే వ్యక్తులు సాడ్ వల్ల ఒక పర్టిక్యులర్ కాలంలో డిప్రెషన్ కు లోనవుతారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ప్రతి ఏడు ఒకే కాలంలో వస్తుంది. చలికాలంలో ఇలాంటి సమస్యలు రావచ్చు కొందరిలో. ఈ సమస్య ఉన్నపుడు శక్తిహీనంగా ఉండడంతో పాటు డిప్రెషన్ తో బాధ పడుతుంటారు. ఈ స్థితి నుంచి బయటపడేందుకు స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ బాగా ఉపకరిస్తుందని డాక్టర్ల అభిప్రాయం.

అయితే నగ్నంగా పడుకున్నపుడు బెడ్ షీట్స్ మీద మామూలు కంటే ఎక్కువ బ్యాక్టీరియా చేరుతుంది. అందుకని తరచుగా బెడ్ షీట్స్ మార్చడం అవసరం అవుతుంది. అయితే మీ సొంత బెడ్ మీద పడుకున్నపుడు మాత్రమే ఇలా నగ్నంగా నిద్రించడం మంచిది. కానీ హోటల్ రూముల్లో లేక ఇంకెక్కడైనా పడుకుంటే మాత్రం ఇలాంటి ఆలోచన వద్దు.

ఆరోగ్యంగా ఉండడం అనేది అన్నింటి కంటే ముఖ్యం. అందుకు మీకు నగ్నంగా నిద్రించడం దోహదం చెయ్యవచ్చు. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి, తగినంత వ్యాయామం, ఒకవేళ తీసుకున్న ఆహారం నుంచి పోషణ సరిపోవడం లేదని అనిపిస్తే అవసరమైన సప్లిమెంట్లు తీసుకోవడం వంటివన్నీ కూడా ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతాయి.