మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి సర్జరీ

విధాత: ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. నిన్న‌ రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ఐసీయూలో కొడాలి నాని ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి […]

  • By: krs    health    Nov 19, 2022 8:00 AM IST
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి సర్జరీ

విధాత: ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.

నిన్న‌ రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ఐసీయూలో కొడాలి నాని ఉన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు.

అనంతరం అంతా బాగుందనుకుంటే 15 రోజుల తర్వాత కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు చేయనున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్ప‌డ‌టంతో ఆయ‌న‌కు నొప్పి ఎక్కువై, ఆసుప‌త్రిలో చేరార‌ని చెబుతున్నారు.