యూరిక్‌ యాసిడ్‌ సమస్యలతో బాధ పడుతున్నారా?.. ఈ పండ్లు తిని చూడండి..!

Uric Acid | విటమిన్-ఈ ఉన్న పండ్లను తింటే దగ్గు, జలుబుతో పాటు ఇతర వ్యాధులకు సైతం మేలు జరుగుతుంది. అదే సమయంలో ఈ పండ్లను తీసుకున్నా యూరిక్‌ యాసిడ్‌ సమస్యల నుంచి బయటపడొచ్చు. యూరిక్‌ యాసిడ్‌ను నియంత్రించడంలో సీ విటామిన్‌ ఉండ పండ్లు ఉపయుక్తంగా ఉంటాయి. ఎవరైనా యూరిక్‌ యాసిడ్‌ సమస్యలతో బాధపడుతున్న వారు ఆహారంలో ఈ పండ్లను చేర్చుకుంటే బయటపడొచ్చు. జామకాయలు జామకాయలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మంచి మొత్తంలో యాంటీఆక్సిడెంట్ లైకోపీన్ […]

యూరిక్‌ యాసిడ్‌ సమస్యలతో బాధ పడుతున్నారా?.. ఈ పండ్లు తిని చూడండి..!

Uric Acid | విటమిన్-ఈ ఉన్న పండ్లను తింటే దగ్గు, జలుబుతో పాటు ఇతర వ్యాధులకు సైతం మేలు జరుగుతుంది. అదే సమయంలో ఈ పండ్లను తీసుకున్నా యూరిక్‌ యాసిడ్‌ సమస్యల నుంచి బయటపడొచ్చు. యూరిక్‌ యాసిడ్‌ను నియంత్రించడంలో సీ విటామిన్‌ ఉండ పండ్లు ఉపయుక్తంగా ఉంటాయి. ఎవరైనా యూరిక్‌ యాసిడ్‌ సమస్యలతో బాధపడుతున్న వారు ఆహారంలో ఈ పండ్లను చేర్చుకుంటే బయటపడొచ్చు.

జామకాయలు

జామకాయలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మంచి మొత్తంలో యాంటీఆక్సిడెంట్ లైకోపీన్ ఉంటుంది. దాంతో యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతుంటే సమస్య నుంచి గట్టెక్కొచ్చు. అంతే కాకుండా యూరిక్ యాసిడ్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ బాధితులకు సైతం ఈ పండు ఉపయోగకరంగా ఉంటుంది.

నిమ్మకాయ

విటమిన్ సీ అత్యధికంగా దొరికే కాయల్లో నిమ్మకాయలు ఒకటి. వీటిని రోజు తీసుకుంటే యూరిక్‌ యాసిడ్‌ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా మంచి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.

లిచీ పండు..

లిచీ పండ్లు కొంచెం పుల్లగా, తీయ్యగా ఉంటాయి. ఇందులో విటమిన్ సీ కూడా ఎకువగానే ఉంటుంది. యూరిక్ యాసిడ్ సమస్య బాధితులయితే దీన్ని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

నారింజ

నారింజ పండ్లలో సైతం ఎక్కువ మొత్తంలో విటమిన్‌ సీ ఉంటుంది. నిత్యం రోజుకూ నారింజ పండును తీసుకుంటే విటమిన్‌ సీ లోపాన్ని అరికట్టవచ్చు. దాంటో పాటు యూరిక్ యాసిడ్ సమస్య కూడా దూరమవుతుంది.