సింగపూర్ విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి, 30మందికి గాయాలు
బ్యాంకాగ్‌లో విమానంలో భారీ కుదుపులు చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. లండన్ నుంచి సింగపూర్ కు 211మంది ప్రయాణికులు, 18మంది సిబ్బందితో వెలుతున్న

విధాత: బ్యాంకాగ్‌లో విమానంలో భారీ కుదుపులు చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. లండన్ నుంచి సింగపూర్ కు 211మంది ప్రయాణికులు, 18మంది సిబ్బందితో వెలుతున్న విమానం భారీ కుదుపులతో బ్యాంకాగ్లోని సువర్ణభూమి విమనాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండ్ అయ్యింది. విమానంలో తలెత్తిన భారీ కుదుపులతో విమానంలోని ఒకరు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాదవార్త తెలుసుకున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపింది. ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించేందుకు థాయిలాండ్ అధికారులతో కలిసి పనిచేస్తామని, ఇందుకోసం ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపిస్తున్నామని తెలిపింది.
ALSO READ : US Army | 90వేల మంది సైనికులకు అమెరికా గుడ్‌బై?