మ‌స్క్‌కు పోటీగా జెఫ్ బెజోస్‌.. రెండు ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగించిన అమెజాన్‌

  • Publish Date - October 7, 2023 / 08:52 AM IST

విధాత‌: స్పేస్ ఎక్స్ (Space X) అధిప‌తి ఎలాన్ మ‌స్క్‌, అమెజాన్ (Amazon) అధిప‌తి జెఫ్ బెజోస్‌ల మ‌ధ్య అంత‌రిక్ష పోటీకి తెర‌లేచింది. స్పేస్ ఎక్స్ ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందించ‌డానికి ఏర్పాటు చేసిన స్టార్‌లింక్‌కు పోటీగా బెజోస్ సైతం కూప‌ర్ ఇంట‌ర్నెట్ నెట్వ‌ర్క్‌ను తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే.


దీనికి సంబంధించి శ‌నివారం రెండు ప్రోటో టైప్ ఉప‌గ్ర‌హాల‌ను ఆ సంస్థ విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. యునైటెడ్ లాంచ్ అల‌య‌న్స్ అట్లాస్ 5 రాకెట్ వీటిని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. వ‌చ్చే కొన్నేళ్ల‌లో సుమారు 3,236 ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగించ‌డం ద్వారా ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందించాల‌ని అమెజాన్ భావిస్తోంది.


దీని కోసం రూ.8000 కోట్ల (10 బిలియ‌న్ డాలర్స్‌)ను పెట్టుబ‌డిగా పెట్టాల‌ని నిర్ణ‌యించింది. ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందించ‌డానికి అమెజాన్‌, స్పేస్ఎక్స్ వంటి సంస్థ‌లు ఉప‌గ్ర‌హాల‌ను స్వ‌ల్ప భూ క‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెడ‌తాయి. ఇవి భూమికి సుమారు 590 నుంచి 630 కి.మీ. ఎత్తులో ఉంటాయి. త‌ద్వారా కేబుల్స్‌, ఫైబ‌ర్ ద్వారా నెట్ అందించ‌లేని ప్రాంతాల‌కూ శాటిలైట్ల ద్వారా అంత‌ర్జాల సేవ‌ల‌ను అందించొచ్చు. అందుకే అమెజాన్‌, స్పేస్ఎక్స్ ఈ వ్యాపారంపై దృష్టి పెట్టాయి.


కూప‌ర్ కంటే ఎంతో ముందున్న స్టార్ లింక్‌


టెక్నాల‌జీలో కానీ, వ్యాపార‌ప‌రంగా కానీ కూప‌ర్ కంటే స్టార్‌లింక్ ఎంతో ముందు ఉంద‌ని టెలికాం, మీడియా, ఫైనాన్స్ అసోసియేట్స్ ప్రెసిడెంట్ టిం ఫ‌ర్రార్ పేర్కొన్నారు. స్టార్ లింక్ ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 20 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారుల‌ను క‌లిగి ఉంది. ఏటా ల‌క్ష మంది కొత్త‌గా వినియోగ‌దారులుగా మారుతున్నారు. గ‌తేడాది వారికి 1.4 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయ‌మూ ల‌భించింది.


ఈ లెక్క‌న చూసుకుంటే అమెజాన్ నేతృత్వంలోని కూప‌ర్ త‌న సేవ‌ల‌ను ఆరంభించే నాటికే స్టార్ లింక్‌కు 10 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారులు ఉండ‌టంతో పాటు 5 నుంచి 8 బిలియ‌న్ డాల‌ర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. స్పేస్ఎక్స్‌ను అందుకోవాలంటే అమెజాన్ ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంద‌ని పేర్కొన్నారు.

Latest News