కవలలకు జన్మనిచ్చిన యువతి.. తండ్రులు మాత్రం ఇద్దరు
విధాత: ఇది విచిత్ర సంఘటన.. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ.. ఇది నగ్న సత్యం. ఆ యువతికి జన్మించిన కవలలకు ఇద్దరు తండ్రులు అని వైద్యులే తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆ కవలల తల్లి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ అరుదైన సంఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే బ్రెజిల్‌లోని ఓ 19 ఏండ్ల యువతి 16 నెలల క్రితం కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ ఇద్దరు మగపిల్లలు ఒకే పోలికలను కలిగి […]

విధాత: ఇది విచిత్ర సంఘటన.. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ.. ఇది నగ్న సత్యం. ఆ యువతికి జన్మించిన కవలలకు ఇద్దరు తండ్రులు అని వైద్యులే తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆ కవలల తల్లి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ అరుదైన సంఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది.
వివరాళ్లోకి వెళితే బ్రెజిల్‌లోని ఓ 19 ఏండ్ల యువతి 16 నెలల క్రితం కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ ఇద్దరు మగపిల్లలు ఒకే పోలికలను కలిగి ఉన్నారు. దీంతో ఆ యువతికి అనుమానం వచ్చింది. అసలు తండ్రి ఎవరా? అనే ప్రశ్న ఆమె మెదడులో మెదిలింది.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. డాక్టర్లను సంప్రదించింది. ఆ కవలలకు తండ్రిగా భావిస్తున్న వ్యక్తిని పిలిపించి, డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రమే అతను తండ్రి అని డాక్టర్లు తేల్చారు. ఒక పిల్లాడి డీఎన్ఏతోనే ఆ వ్యక్తి డీఎన్ఏ సరిపోలుతుందని వైద్యులు తెలిపారు.

మరి ఇంకో అబ్బాయి తండ్రి ఎవరా? అని ఆమె ఆలోచించ సాగింది. అయితే తన భర్తతో శృంగారంలో పాల్గొన్న రోజే మరో యువకుడితో శృంగారం చేసినట్లు ఆ యువతి తెలిపింది. దీంతో అతన్ని డీఎన్ఏ పరీక్షించగా, రెండో అబ్బాయి డీఎన్ఏతో సరిపోలింది. దీంతో ఆ కవలలకు ఇద్దరు తండ్రులని వైద్యులు స్పష్టం చేశారు.
సైన్స్ ప్రకారం ఇలాంటి ఘటనను హెటిరో పేరెంటర్ సూపర్ ఫెకండేషన్ (బహుళ అండోత్పత్తి) అని పిలుస్తారని వైద్యులు పేర్కొన్నారు. అయితే యువతి రెండు అండాలు.. వారి శుక్రకణాలతో వేర్వేరుగా ఫలదీకరణం చెందడం వల్లే రెండు పిండాలు.. వేర్వేరు మావిల్లో పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి ఘటనలు పశువుల్లో ఎక్కువగా సంభవిస్తాయన్నారు. ఆవులు, పిల్లులు, కుక్కల్లో ఇలాంటి ఘటనలు చూస్తుంటామని చెప్పారు. ఇలాంటి కేసులు 10 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే జరుగుతుంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.