పాస్‌వర్డ్‌లకు గూగుల్‌ మంగళం..! త్వరలో అందుబాటులోకి పాస్‌కీ..!

పాస్‌వర్డ్‌లకు గూగుల్‌ మంగళం..! త్వరలో అందుబాటులోకి పాస్‌కీ..!

విధాత‌: టెక్‌ దిగ్గజం గూగుల్‌ పాస్‌వర్డ్‌లకు ముగింపు పలుకబోతున్నది. త్వరలో యూజర్లందరికీ పాస్‌కీలు డిఫాల్ట్ సైన్ ఇన్ ఉంటుందని వెల్లడించింది. గూగుల్‌ అకౌంట్‌ ఉన్న ప్రతి వినియోగదారుడు డిఫాల్ట్‌గా అకౌంట్‌ కోసం పాస్‌కీని క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం తమ అకౌంట్‌ సెట్టింగ్‌లో సెటప్‌ ప్రక్రియ కోసం మాన్యువల్‌గా సెర్చ్‌ చేయాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది.


పాస్‌కీలు పాస్‌వర్డ్‌లకన్నా మరింత సురక్షితగా ఉంటాయని గూగుల్‌ వెల్లడించింది. బయోమెట్రిక్ సెన్సార్ (ఫేషియల్ రికగ్నిషన్-ఫింగర్ ప్రింట్ ), ప్యాటర్న్, పిన్‌ని ఉపయోగించి యాప్‌లు, వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావొచ్చని తెలిపింది. అయితే, దీంతో పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.


అయితే, పాస్‌వర్డ్‌లు అకస్మాత్తుగా మాయమయ్యేవి కావని.. తాము పైవట్‌ చేస్తున్నప్పుడు పాస్‌వర్డ్‌లు మన జీవితంలో భాగమవుతాయని పేర్కొంది. వినియోగదారులు ఇప్పటికీ తమ అకౌంట్లను లాగిన్‌ చేసేందుకు పాస్‌వర్డ్‌లను ఉపయోగించవచ్చని తెలిపింది. పాస్‌కీలను ఉపయోగించకూడదని స్కిప్‌ చేసి.. పాస్‌వర్డ్‌లను వినియోగించడం కొనసాగించవచ్చని చెప్పింది.


పాస్‌ కీ అంటే..


సంప్రదాయ పాస్‌వర్డ్‌లను ఉపయోగించకుండా అకౌంట్‌ను సైన్‌ ఇన్‌ చేయడానికి పాస్‌ కీ సరికొత్త మార్గం. పాస్‌వర్డ్‌ల కంటే పాస్‌కీ వేగంగా సైన్‌ ఇన్‌ కావడంతో పాటు సురితమైనవని గూగుల్‌ పేర్కొంటున్నది. అకౌంట్‌ను సెక్యూరిటీ విషయంలో ప్రత్యేకంగా క్రిప్టోగ్రఫీపై ఆధారపడతాయని, పాస్‌కీస్‌తో డివైజ్‌ను అన్‌లాక్ చేయడానికి ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ, కోడ్‌లను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే, పాస్‌కీలు ప్రస్తుతం పెద్దగా పాపులర్‌ కాలేదని, యూజర్లు కావాలనుకుంటే పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ కావొచ్చని చెప్పింది. డివైజ్‌లో సెట్టింగ్‌ మార్చి పాస్‌కీ మార్చుకోవచ్చు.


పాస్‌కీ వెబ్‌సైట్లు, యాప్‌లకు సైన్ ఇన్ చేయడానికి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగించుకోవచ్చు. దాంతో ఇకపై పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, పాస్‌వర్డ్‌ల మాదిరిగా యూజర్‌ పాస్‌కీలను సైబర్‌ నేరగాళ్లు, హ్యాకర్స్‌ తెలుసుకోలేరని గూగుల్‌ పేర్కొంటున్నది. ఇప్పటికే పలువురు ఈ పాస్‌ కీలను ఉపయోగిస్తున్నారని తెలిపింది.


అయితే, ఈబే, ఉబెర్ సహాలు పలు యాప్‌లు సైతం పాస్‌కీని ఉపయోగించడం ప్రారంభించాయని, వాటిలో పాస్‌వర్డ్‌లను ఉపయోగించకుండా పాస్‌కీని ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. త్వరలో వాట్సాప్‌లోనూ పాస్‌కీని ఉపయోగించుకోవచ్చని తెలిపింది.యూజర్లు ఇతర ఆన్‌లైన్ అకౌంట్లలో పాస్‌కీని ఎప్పుడు ఉపయోగించవచ్చని సమాచారం అందిస్తామని టెక్‌ దిగ్గజం తెలిపింది.