ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య గురైంది. ఆస్ట్రేలియాలోని బక్లీలో ఈ దారుణ ఘటన జరిగింది
విధాత, హైదరాబాద్ : ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య గురైంది. ఆస్ట్రేలియాలోని బక్లీలో ఈ దారుణ ఘటన జరిగింది. రోడ్డు సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో చైతన్య మాధగాని అలియాస్ (శ్వేత) మృతదేహం లభ్యమైంది. చైతన్యతో ఆమె భర్త అశోక్ రాజ్ గొడవపడి ఆమెను చంపి చెత్త బుట్టలో పడేసి కొడుకును తీసుకుని ఇండియాకి పారిపోయినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విక్టోరియా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఒక రోజు క్రితమే ఇదే అస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన తెలుగు వైద్యురాలు కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ వేమూరు ఉజ్వల (23) ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందింది. వరుసగా ఇద్దరు తెలుగు మహిళలు ఆస్ట్రేలియాలతో ప్రాణాలు కోల్పోవడం బంధువుల్లో విషాదాన్ని నింపింది.