విధాత: మార్కెట్లో ఆపిల్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తుంటుంది. ఇటీవల ఐఫోన్ 15 సిరీస్‌ను తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఫోన్లకు భారీగా మంచి స్పందన వస్తున్నది. మరో వైపు రాబోయే రోజుల్లో ఆపిల్ పలు ఉత్పత్తులను పరిచయం చేయబోతున్నది. ఇందులో ఒకటి ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్-6 ఒకటి. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఆ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం రండి..!
సమాచారం ప్రకారం.. ఆపిల్ వచ్చే ఏడాది నాలుగు ఐప్యాడ్స్‌ను లాంచ్ చేయబోతున్నది. వైఫై, సెల్యులర్ ప్లస్ వైఫై వర్షెన్ ఇందులో ఉండనున్నాయి. ఇక ఐప్యాడ్ ఎయిర్-6 సైతం భారీగా ఉండబోతుందని.. అలాగే ఇందులో అనేక అడ్వాన్స్డ్ ఫీచర్ ఉండబోతున్నాయని సమాచారం. ప్రస్తుతానికైతే.. రెండు ఐప్యాడ్లకు జే537, జే538 పేరిట కోడ్ నేమ్‌ని పెట్టింది. లీక్ అయిన వివరాలను పరిశీలిస్తే.. ఈ ఐప్యాడ్‌లో సరికొత్త మ్యాజిక్ కీబోర్డ్ ఉండనున్నది. అలాగే యాక్సెలరోమీటర్ సహా రెండు సెన్సార్లు ఉంటాయి.
ఈ కీబోర్డ్ కోడ్ నేమ్ ఆర్219. ప్రస్తుతం ఈ ఉత్పత్తులపై పని చేస్తున్న ఆపిల్ 2024లో జరిగే ఈవెంట్లో ఆయా ఉత్పత్తులను లాంఛ్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున ఆన్లైన్లో ప్రచారం జరుగుతుండగా.. ఇప్పటి వరకు కంపెనీ స్పందించలేదు. ఇదిలా ఉండగా.. ఐప్యాడ్ మినీ 7 సైతం త్వరలోనే మార్కెట్లో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. న్యూ మినీ జనరేషన్‌తో ప్రాసెసర్ అప్డేట్ అవుతుందని తెలుస్తున్నది. ఇదే నిజమైతే మోడల్‌కు మరింత డిమాండ్ ఉంటుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.