“సూట్ వేసుకున్న ఒసామా బిన్ లాడెన్” – అసిమ్ మునీర్ మైఖేల్ రూబిన్ ఘాటు వ్యాఖ్యలు
అమెరికా నేలపై అణ్వాయుధ బెదిరింపులు చేసిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ ఘాటు విమర్శ – ‘సూట్ వేసుకున్న ఒసామా బిన్ లాడెన్’.

వాషింగ్టన్: అమెరికా నేలపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చేసిన అణ్వాయుధ బెదిరింపులు తీవ్ర వివాదానికి దారితీశాయి. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) మాజీ అధికారి మైఖేల్ రూబిన్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, మునీర్‌ను “సూట్ వేసుకున్న ఒసామా బిన్ లాడెన్”గా అభివర్ణించారు. లాడెన్ గుహలో ఉండేవాడు. మునీర్ ప్యాలెస్‌లో ఉన్నాడు..అంతే తేడా అంటూ, పాకిస్తాన్ ఒక వెధవ దేశం()లా ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు.
మైఖేల్ రూబిన్ రక్షణ విధాన, మధ్యప్రాచ్య విషయాలలో ఒక ప్రముఖ శాస్త్రవేత్త, Pentagonలో ప్రభుత్వ అనుభవం, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపన, ప్రచురణా రంగంలో విస్తృత అనుభవం—అన్నిటికి కూడా గురువుగా నిలిచే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.
అమెరికాలోనే అణ్వాయుధ బెదిరింపులు
తాజాగా అమెరికా ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన సమావేశంలో, అమెరికా సైనికాధికారుల సమక్షంలో మునీర్ మాట్లాడుతూ – “పాకిస్తాన్ కూలిపోతే, ప్రపంచంలో సగం దేశాలను తనతో తీసుకుపోతుంది” అని హెచ్చరించారు. ఈ అణ్వాయుధ బెదిరింపులను భారత్ అధికారికంగా ఖండించింది. మూడవ దేశపు నేలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పాకిస్తాన్, ఆసిమ్ మునీర్ గురించి మైఖేల్ రూబిన్ మాటల్లో:
- “పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులు ఉగ్రవాదులకు అణ్వాయుధాలను ‘చట్టవ్యతిరేక’ మార్గంలో వాడుకునే అవకాశం ఇస్తాయి”
- “అసిమ్ మునీర్ వ్యాఖ్యలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మాటలను గుర్తు చేస్తున్నాయి”
- “అమెరికా నేలపై ఇలాంటి మాటలు అనడం పూర్తిగా అంగీకరించలేనిది”
‘తక్షణ బహిష్కరణ’ అవసరం
రూబిన్ ప్రకారం, మునీర్ వ్యాఖ్యల 30 నిమిషాల లోపే ఆయన్ని సమావేశం నుంచి బయటకు పంపించి, టాంపా ఎయిర్‌పోర్ట్ నుంచి దేశం వెలుపలికి పంపాల్సింది. ఆయన అమెరికా వీసా పొందకూడదని, పాకిస్తాన్ అధికారులు క్షమాపణ చెప్పే వరకు అమెరికాలో అడుగు పెట్టకూడదని సూచించారు.
పాకిస్తాన్ ‘దేశం హక్కు’ కోల్పోయింది
- రూబిన్ అభిప్రాయం ప్రకారం, ప్రపంచానికి సగానికి అణ్వాయుధ బెదిరింపు చేసే దేశానికి ‘లెజిటిమేట్ స్టేట్’ హోదా ఉండకూడదు.
- భవిష్యత్తులో అమెరికా, అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్‌పై “మ్యానేజ్డ్ డిక్లైన్” విధానం అనుసరించాలి.
- బలోచిస్తాన్ వంటి విభజన ప్రాంతాల స్వతంత్రతను పరిగణించాలి.
- అవసరమైతే, నేవీ సీల్ టీమ్‌లను పంపి పాకిస్తాన్ అణ్వాయుధ భాండాగారాన్ని భద్రపరచాలి.
అమెరికా మాజీ పెంటగాన్ అధికారి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు పాకిస్తాన్ అంతర్జాతీయ ప్రతిష్టకు మరింత దెబ్బతీసాయి. అసిమ్ మునీర్ వ్యాఖ్యలతో అణ్వాయుధ భయం మళ్లీ ప్రస్తావనలోకి వచ్చి, దక్షిణాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉండకూడని చేతుల్లో అణ్వాయుధాలు ఉండటం అత్యంత ప్రమాదకరమని అణు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Catogories : International news
Keywords: