విండోస్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..! వెబ్‌ యాప్‌ స్టోర్‌ను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్‌..!

  • Publish Date - October 8, 2023 / 06:12 AM IST

విధాత‌: విండోస్‌ యూజర్లకు మైక్రోసాఫ్ట్‌ శుభవార్త చెప్పింది. విండోస్‌ యాప్స్‌, ఎక్స్‌బాక్స్‌పీసీ గేమ్స్‌ సెర్చింగ్‌ కోసం గతంలో వాడిన కోడ్‌బేస్‌ యాస్‌ స్టోర్‌ స్థానంలో కొత్తగా వెబ్‌యాప్‌ స్టోర్‌ను ప్రారంభించింది. దీంతో యాప్స్‌ సెర్చింగ్‌ మరింత సులువుకానున్నది. యూజర్లకు మరింత తేలికైన సెర్చింగ్‌ సదుపాయాలను కల్పించే ఉద్దేశంతో స్టోర్‌ను తీసుకువచ్చినట్లు మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది.


ఇటీవల టెక్‌ దిగ్గజం మ్యాక్‌, విండో యూజర్ల కోసం మ్యాక్‌ కోసం టీమ్స్‌ యాప్‌ను సైతం అప్‌డేట్‌ చేయగా.. తాజాగా కొత్త వెబ్ యాప్ స్టోర్‌ను పరిచయం చేసింది. గతంలో అందుబాటులోనే ఉన్న స్టోర్‌ను అప్‌డేట్‌ చేయకుండా.. పూర్తిగా రీ డిజైన్‌ చేయడంతో పాటు కొత్త యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌(UI)తో యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దింది. దీంతో వెండోస్‌ ఎక్స్‌బాక్స్‌ పీసీ గేమర్స్‌కు స్టోర్‌లో యాప్స్‌ను సెర్చ్‌ చేయడంతో పాటు డౌన్‌లోడ్‌ చేయడం మరింత తేలికగా కానున్నది.


అయితే, కొత్తగా తీసుకువచ్చి వెబ్‌ యాప్‌స్టోర్‌కు గతంలో ఉన్న యాప్‌ స్టోర్‌కు ఎలాంటి పోలికలు ఉండవని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది కోడ్‌బేస్‌ యాప్‌ను పూర్తిగా మార్చివేసి కొత్తగా యూఐతో అప్‌డేటెడ్‌ వెబ్‌ యాప్‌ స్టోర్‌ను రూపొందించినట్లు ప్రకటించింది. దీంతో యాప్‌ సెర్చింగ్‌, యాప్స్‌ వివరాలు తెలుసుకోవడం సులువవుతుందని, డ్రాప్ డౌన్ మెన్యూతో సెర్చ్ ఫంక్షనాలిటీని సైతం మెరుగుపరిచినట్లు టెక్‌ కంపెనీ వివరించింది.

Latest News