World Most Powerful Passport | ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌గా సింగపూర్ పాస్‌పోర్ట్..! జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..?
World Most Powerful Passport | ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వీసాతో పాటు పాస్ట్‌పోర్ట్ తప్పనిసరి. కొన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లేందుకు అనుమతి ఉంటుంది కానీ పాస్‌పోర్ట్ లేనిదే ఎంట్రీ ఉండదు. ఆయా దేశాలు వారి పౌరులకు పాస్‌పోర్టులు జారీ చేస్తుంటాయి. అయితే, కొన్ని దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లు పవర్‌ఫుల్. ఈ పాస్‌పోర్టులతో ప్రయాణికులు వీసా లేకుండానే విమానం టికెట్ తీసుకొని అప్పటికప్పుడు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఈ పవర్ ఫుల్ […]

World Most Powerful Passport | ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వీసాతో పాటు పాస్ట్‌పోర్ట్ తప్పనిసరి. కొన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లేందుకు అనుమతి ఉంటుంది కానీ పాస్‌పోర్ట్ లేనిదే ఎంట్రీ ఉండదు. ఆయా దేశాలు వారి పౌరులకు పాస్‌పోర్టులు జారీ చేస్తుంటాయి.
అయితే, కొన్ని దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లు పవర్‌ఫుల్. ఈ పాస్‌పోర్టులతో ప్రయాణికులు వీసా లేకుండానే విమానం టికెట్ తీసుకొని అప్పటికప్పుడు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఈ పవర్ ఫుల్ జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది. ఆ జాబితాలో భారత్ పాస్‌పోర్ట్ ఎన్నో స్థానంలో ఉందో చూద్దాం రండి..!
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ ఈ ఏడాదిలో శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాను ప్రకటించింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం (ఐఏటీఏ) నుంచి సేకరించిన డేటా ఆధారంగా 199 దేశాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. జాబితాలో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో సింగపూర్ తొలిస్థానంలో నిలిచింది.
దీంతో ఆ దేశ పౌరులు 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లి రావొచ్చు రెండో స్థానంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఐదేళ్లుగా పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితాలో ఉన్న జపాన్ మూడోస్థానంలోకి పడిపోయింది. ఆస్ట్రేలియా, ఫిన్‌లాండ్, ఫ్రాన్, సౌత్ కొరియా, లక్సెంబర్గ్, స్వీడన్‌తో కలిసి జపాన్ మూడో స్థానంలో ఉన్నది. డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్, యూకేలు 4వ స్థానంలో కొనసాగుతున్నాయి.
5వ స్థానంలో బెల్జియం, చెక్ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, స్విట్జర్లాండ్ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వ్యక్తులు 187 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ ర్యాంకింగ్‌లో భారత్ 80వ స్థానంలో నిలిచింది.
భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న వ్యక్తులు వీసా లేకుండా ప్రపంచంలోని 57 దేశాలకు ప్రయాణించే వీలుంది. ఈ జాబితాలో భారత్ పొరుగు దేశం చైనా 63వ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ 100వ స్థానంలో ఉంది. వీసా లేకుండా చైనా ప్రజలు 80 దేశాల్లోనూ, పాకిస్థాన్ ప్రజలు 33 దేశాల్లో ప్రయాణించే వీలుంటుంది.