షార్క్ దాడిలో నవ వధువు మృతి
సముద్రంలో పెడల్ బోర్డింగ్ చేస్తున్న ఒక నవ వధువు.. సొరచేప దాడిలో మృతిచెందిన ఘటన బహమాస్‌లో చోటు చేసుకున్నది.

బహమాస్ : పెళ్లయిన తర్వాత రోజు మృత్యువు షార్క్ రూపంలో ఓ మహిళను బలిగొంది. ఈ ఘటన బహమాస్‌లో చోటు చేసుకున్నది. పెళ్ళైన ఆనందంలో తన భర్తతో కలిసి 44 ఏళ్ల మహిళ సముద్రంలో పెడల్ బోర్డింగ్ చేస్తుండగా ఒక షార్క్ అటాక్ చేసింది. మృతురాలిది బోస్టన్. ఆమెకు ఈ ఆదివారమే వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. సోమవారం బీచ్‌లో పెడల్ బోర్డింగ్ చేస్తుండగా షార్క్ దాడి జరిగింది. సోమవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:15 గంటలకు యూఎస్ఏ కి చెందిన మహిళపై షార్క్ దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే చనిపోయిన మహిళ పేరును వెల్లడించలేదు.
బామర్స్‌లోని వెస్ట్రన్ ప్రావిన్స్‌లో గల ఒక రిసార్ట్ వెనకాల ఉన్న సముద్ర తీరం నుంచి దాదాపు మూడు లేదా నాలుగు మైళ్ళ దూరంలో సముద్రంలో విహరిస్తుండగా మహిళపై ఈ దాడి జరిగిందని పోలీసులు ఓ ప్రకటనలో తెలియజేశారు. షార్క్‌దాడిలో మహిళకు కుడి తుంటి భాగము, కుడి అవయవాలపై తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమె చనిపోయిందని వెల్లడించారు. కేబుల్ బీచ్ లోని శాండిల్స్ రిసార్ట్ సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతం మొత్తం మూడు వేల కంటే ఎక్కువ ద్వీపాలు కలిగిన దేశం. దాని ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా టూరిజంపైనే ఆధారపడి ఉంది. ఈ ప్రాంతం సముద్రతీరం బీచ్ లకు ప్రసిద్ధి. షార్కుల దాడి ఇక్కడ చాలా అరుదు. ఏడాదికి ఐదారు ఘటనలు మాత్రమే ఇలా జరుగుతుంటాయి. అయితే ఆస్ట్రేలియాలో ఎక్కువగా షార్క్ దాడులకు గురవుతున్నారు.