చిరుత‌లాంటి చేపను చూశారా?

  • Publish Date - October 26, 2023 / 10:19 AM IST

  • ఆస్ట్రేలియాలోని కోర‌ల్ సీ మెరైన్ పార్కులో కనిపించిన అరుదైన‌ మీనం


విధాత‌: ఆస్ట్రేలియా స‌ముద్రంతో అత్యంత అరుదైన చేప క‌నిపించింది. ప్రపంచ ప్రఖ్యాత నార్త్ హార్న్ డైవ్ సైట్‌లో ఈత కొడుతుండగా చిరుతపులి మ‌చ్చ‌ల‌ను పోలిన చేప‌ను స్కూబా డైవర్ కేథరీన్ గుర్తించారు. ఇద్దరు స్కూబా డైవర్లు కేథరీన్, మిచెల్ ఆస్ట్రేలియా తీరంలో కోరల్ సీ మెరైన్ పార్క్ లోతులను అన్వేషిస్తున్నప్పుడు అరుదైన చిరుత మ‌చ్చ‌ల చేప వారికి క‌నిపించింది. మూడు అంగుళాల పొడవు, ఇరుకైన-ముక్కు చిరుతపులిని పోలిన మెస్మరైజింగ్ నమూనాతో వారిని ఆక‌ర్షించింది.


స‌ముద్రంలో అరుదైన జీవ‌రాశుల‌ను గుర్తించ‌డంలో ఉత్స‌హం క‌న‌బ‌రిచే కేథరీన్, మిచెల్ అదురైన చేప గురించి నిపుణుల‌ను సంప్ర‌దించారు. సాధారణంగా 98 నుంచి 164 అడుగుల లోతులో, తరచుగా గుహలు, డ్రాప్-ఆఫ్‌ల పరిసరాల్లో ఇలాంటి అరుదైన‌ చేప‌లు క‌నిపిస్తాయ‌ని వారు వెల్ల‌డించారు. అద్భుతమైన, అరుదైన చేప వీడియోను గ్రేట్ బారియర్ రీఫ్ మెరైన్ పార్క్ అథారిటీకి అనుబంధంగా ఉన్న మాస్టర్ రీఫ్ గైడ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో వీడియో వైర‌ల్‌గా మారింది.

Latest News