Stag Beetle | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం ఇది.. దీని విలువ అక్షరాల 75 లక్షలు..!
Stag Beetle| ఈ భూమ్మీద అనేక రకాల కీటకాలు ఉన్నాయి. కొన్ని హానీకరమైనవి కాగా, మరికొన్ని ఔషధ గుణాలు కలిగిన కీటకాలు ఉన్నాయి. కొన్ని కీటకాలు మనషులను ప్రాణాలను తీయగలవు.. మరికొన్ని కీటకాలను ఆహారంగా తీసుకుంటారు. అయితే ఈ కీటకాల్లో కెల్లా అత్యంత ఖరీదైన కీటకం ఒకటుంది. ఈ కీటకం పేరే స్టాగ్ బీటిల్.

Stag Beetle| ఈ భూమ్మీద అనేక రకాల కీటకాలు ఉన్నాయి. కొన్ని హానీకరమైనవి కాగా, మరికొన్ని ఔషధ గుణాలు కలిగిన కీటకాలు ఉన్నాయి. కొన్ని కీటకాలు మనషులను ప్రాణాలను తీయగలవు.. మరికొన్ని కీటకాలను ఆహారంగా తీసుకుంటారు. అయితే ఈ కీటకాల్లో కెల్లా అత్యంత ఖరీదైన కీటకం ఒకటుంది. ఈ కీటకం పేరే స్టాగ్ బీటిల్. దీని ధర బీఎండబ్ల్యూ, ఆడీ కార్లతో పోటీ పడుతోంది. స్టాగ్ బీటిల్ ధర అక్షరలా రూ. 75 లక్షలు. మరి ఈ కీటకం ఎక్కడ లభ్యమవుతుందో తెలుసుకుందాం.
అత్యంతక ఖరీదైన స్టాగ్ బీటిల్ కీటకం.. కేవలం 2 నుంచి 3 అంగుళాల సైజులో మాత్రమే ఉంటుంది. ఎక్కువగా చెత్తలో కనిపిస్తుంది. ఇక ఈ కీటకాన్ని జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి పెంచి పోషించి, దాన్ని రూ. 75 లక్షలకు విక్రయించాడు. ఈ అరుదైన కీటకాన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. ఇవి భూమ్మీద ఉండే అత్యంత చిన్న కీటకం. ఈ స్టాగ్ బీటిల్స్‌ను ప్రమాదకరమైన వ్యాధులను నయం చేసే మందుల తయారీలో వినియోగిస్తారు. అందుకే ఈ కీటకాలు ఖరీదైన ధరను పలుకుతున్నాయి.
ఆహారం ఇదే..
చెత్త కుప్పల్లో ఉండే ఈ కీటకాలు.. కలపలోని ద్రవాలను, పండ్ల రసం, చెట్ల రసంను ఆహారంగా తీసుకుంటాయి. సుమారు 7 సంవత్సరాల పాటు జీవించే ఈ కీటకాలు ఘన పదార్థాలను ఆహారంగా తీసుకోలేవు. ఇక గుడ్లు పెట్టేందుకు ఆడ కీటకాలు ఎక్కువగా నేల మీదనే జీవిస్తుంటాయి. శీతల వాతావరణం స్టాగ్ బీటిల్స్‌కు సరైన ప్రాంతంకాదు. ఎందుకంటే.. ఇది లార్వా ప్రక్రియను పొడిగించగలదు. శీతాకాలంలో చాలా కీటకాలు చనిపోతాయి. కాబట్టి వెచ్చని ప్రదేశాలు ఉత్తమం.
బలంగా ఆడ కీటకాల దవడలు
స్టాగ్ బీటిల్స్‌ను వాటి తలపై ఉన్న కొమ్ముల ఆధారంగా గుర్తిస్తారు. వీటిలో మగ స్టాగ్ బీటిల్స్ పెద్ద దవడలు కలిగి ఉండగా, ఆడ కీటకాల దవడలు మగ కీటకాల దవడల కంటే బలంగా ఉంటాయి. స్టాగ్ బీటిల్స్ లుకానిడే కుటుంబానికి చెందినవి. కాగా ఇందులో 1200 రకాల కీటకాలు ఉన్నాయి.