ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు.. బయల్దేరిన అమెరికా యుద్ధనౌకలు

  • Publish Date - October 9, 2023 / 09:55 AM IST

  • హమాస్‌పై పోరుకు దిగనున్న అగ్రరాజ్యం
  • అమెరికా వ్యతిరేక దేశాలూ దిగితే ప్రపంచ ఉద్రిక్తతే!


టెల్ అవీవ్: అత్యంత వ్యూహాత్మకంగా భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ జరుపుతున్న దాడులు ఇజ్రాయిల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు భారీ నష్టాలు జరుగుతుండగా.. అమెరికా తో బాటు పలు ఇజ్రాయిల్ మిత్ర దేశాల పౌరుల కిడ్నాపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.


దీంతో హమాస్‌పై ఆయా దేశాలు మండి పడుతున్నాయి. ఇజ్రాయెల్‌లో తమ పౌరులను హమాస్ చంపేస్తున్నట్లు నిర్ధారించుకున్న అమెరికా తమ యుధ్ధ నౌకల్ని, యుధ్ధ విమానాల్ని ఇజ్రాయెల్‌కు పంపుతున్నది. ఇప్పటికే అమెరికా యుధ్ధనౌకలు మధ్యధరా సముద్రంలో బయలుదేరాయి.


భూ, వాయు, మార్గాల్లోదాడులు చేసే క్షిపణుల్నిఈ నౌకలు తీసుకుపోతున్నాయి. ఈ యుధ్ధ నౌకల్లో దాడుల్ని ముందుగానే గుర్తించే అత్యాధునిక నిఘా పరిఙ్ఞానం కూడా ఉన్నది. తద్వారా హమాస్‌తోపాటు.. పాలస్తీనాపై అమెరికా పెద్ద ఎత్తున దాడులకు దిగనున్నదని తెలుస్తున్నది.


ప్రపంచ ఉద్రిక్తతగా మారే అవకాశం?


అమెరికా యుధ్ధంలో దిగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుధ్ధంలో పరిస్థితులు వేగంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా అమెరికా వ్యతిరేక దేశాలు కూడా యుధ్ధంలో దిగితే ప్రపంచ ఉద్రిక్తత మారే ప్రమాదం పొంచి వుందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.

Latest News