BJP Presidents: ఏపీ బీజేపీ సారధి మాధవ్..తెలంగాణకు రామచందర్ రావు!

విధాత: ఏపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఖరారైనట్లుగా సమాచారం. ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును ఖరారు చేసింది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు పేరు ఖరారైనట్లుగా తెలుస్తుంది. వారిద్దరు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేస్తారు. ఏపీ నుంచి మాజీ సీఎం ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు లు కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నప్పటికి పార్టీ అధిష్టానం మాధవ్ వైపు మొగ్గుచూపినట్లుగా పార్టీ వర్గాల కథనం.
ఇక తెలంగాణలో ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ కుమార్, డీకే. అరుణల మధ్య పోటీ నెలకొనగా..అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు పేరును ఖరారు చేసినట్లుగా తెలిసింది. అయితే పార్టీ అధిష్టానం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.