Lover in Burqa | ల‌వ‌ర్‌ను క‌లిసేందుకు బుర్ఖాలో.. దాన్ని గ‌మ‌నించి ప‌ట్టుకున్న స్థానికులు..

ఓ ప్రియుడు( Lover ) త‌న ప్రియురాలి( Girl Friend )ని క‌లిసేందుకు బుర్ఖా( Burqa )లో వెళ్లి అడ్డంగా బుక్క‌య్యాడు. ఆ యువ‌కుడితో సిగ‌రెట్ లైట‌ర్( Cigarette lighter ) ల‌భ్యం కావ‌డంతో అత‌ను పురుషుడు అని నిర్ధారించుకున్న స్థానికులు.. అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు.

Lover in Burqa | ల‌వ‌ర్‌ను క‌లిసేందుకు బుర్ఖాలో.. దాన్ని గ‌మ‌నించి ప‌ట్టుకున్న స్థానికులు..

Lover in Burqa | ఓ యువ‌తీయువ‌కుడు ప్రేమించుకున్నారు. కానీ అత‌ను త‌న ప్రియురాలి (Girl Friend )ని క‌ల‌వ‌లేక‌పోతున్నాడు. ఆమె కూడా బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి. దీంతో ప్రియుడే (Boy Friend ) ఓ ఎత్తుగ‌డ వేశాడు. చివ‌ర‌కు బుర్ఖా (Burqa) ధ‌రించి ప్రియురాలి ఇంటికి వెళ్ల‌గా, అత‌న్ని స్థానికులు గ‌మ‌నించి ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేశారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh )మొర్దాబాద్‌లోని పిప‌ల్‌సానా గ్రామంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అక్బ‌ర్‌పూర్ గ్రామానికి చెందిన చాంద్ అలియాస్ బూరా.. పిప‌ల్‌సానా గ్రామానికి చెందిన ఓ యువ‌తిని గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే త‌న ప్రియురాలిని క‌లిసేందుకు చాంద్ ఓ ప్లాన్ చేశాడు. బుర్ఖా ధ‌రించి వెళ్తే ఎవ‌రికి అనుమానం రాద‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇక ఓ బుర్ఖా కొనుగోలు చేసి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. కానీ అత‌ని న‌డ‌క‌లో తేడా రావ‌డంతో స్థానికులు గ‌మ‌నించి.. చాంద్‌ను ఆపేశారు.

చైల్డ్ ట్రాఫిక‌ర్ (Child trafficker) అనుకొని.. బుర్ఖా తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. కానీ చాంద్ ఆ ప‌ని చేయ‌లేదు. చివ‌ర‌కు ఆధార్ కార్డు (Aadhaar card) చూపించాల‌ని అడిగారు. అది కూడా త‌న వ‌ద్ద లేద‌న్నాడు చాంద్. అక్క‌డున్న వ్య‌క్తుల్లో ఒక‌రు చాంద్‌ను లాగి కొట్టారు. దీంతో అత‌ని బెల్ట్ కింద ఉన్న సిగ‌రెట్ లైట‌ర్ బ‌య‌ట‌ప‌డింది. దీంతో అత‌ను పురుష‌డ‌ని తేలిపోయింది.

ఎందుకు వ‌చ్చావ‌ని నిల‌దీసే స‌రికి త‌న ప్రియురాలిని కలిసేందుకు వ‌చ్చాన‌ని చాంద్ చెప్పాడు. ఈ క్ర‌మంలోనే అత‌నిపై ప‌లువురు దాడికి పాల్ప‌డ్డారు. చివ‌ర‌కు చాంద్‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చాంద్‌ను పోలీసులు విచారిస్తున్నారు.