Telangana Assembly| పంచాయతీ నిధులపై వేముల వర్సెస్ పొన్నం

Telangana Assembly| పంచాయతీ నిధులపై వేముల వర్సెస్ పొన్నం

విధాత, హైదరాబాద్ :  తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో పంచాయతీ రాజ్, మున్సిపల్ సవరణల బిల్లు చర్చ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy)కి, మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)లు పరస్పర విమర్శలు సంధించుకున్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ప(KCR)ల్లె ప్రగతి(Palle Pragathi) కార్యక్రమం తీసుకుని కేంద్ర నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు(Panchayat Funds)అందించారని..దీంతో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. ఫలితంగా 30శాతం కేంద్ర అవార్డులు తెలంగాణ గ్రామ పంచాయతీలకు దక్కాయన్నారు. ఈ 20నెలల కాలంలో బిల్లుల రాకనే సర్పంచ్ లు ఇబ్బంది పడుతున్నారని..ట్రాక్టర్లలో డిజీల్ పోసే పరిస్థితి లేదన్నారు. మేం పంచాయతీలకు నిధులు ఇచ్చామో లేదో ప్రభుత్వం పరిశీలించవచ్చన్నారు.

అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ కేసీఆర్ పల్లెప్రగతితో నిధులిస్తే ఇవ్వాళ సర్పంచ్ లు(Sarpanch Protests) బిల్లుల కోసం ఎందుకు ధర్నాలు చేస్తుున్నారంటూ కౌంటర్ వేశారు. పల్లె ప్రగతి పేరుతో నిధులిస్తామని చెప్పి సర్పంచ్ లకు టార్గెట్ పెట్టి పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా వారిని ఆగం పట్టించారని పొన్నం మండిపడ్డారు.