Priyanka Chopra| పుట్టిన రోజున ప్రియాంకా చోప్రా ముద్దులాట!

Priyanka Chopra| పుట్టిన రోజున ప్రియాంకా చోప్రా ముద్దులాట!

విధాత : బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా..భర్త నిక్ జోనాస్ తో బీచ్ లో ముద్దులాటలో రెచ్చిపోయింది. ఈ జంట రోమాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూలై 18న ప్రియాంకా చోప్రా పుట్టిన రోజు వేడుకలను భర్త నిక్ జోనాస్ మాల్దీవులలో ఆహ్లాదకరమైన బీచ్ ఒడ్డున నిర్వహించాడు. భర్త తన కోసం ఏర్పాటు చేసిన పుట్టిన రోజు ఏర్పాట్లకు ఫిదా అయినా ప్రియాంక చోప్రా ఆనందం పట్టలేక పరుగెత్తికెళ్లి బీచ్ ఒడ్డున భర్త నిక్ జోనాస్ పై దూకేసి లిప్ కిస్ లతో తన ప్రేమను చాటుకుంది. ఈ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు వారి జంట బీచ్ వెకేషన్స్ ను బాగానే ఎంజాయ్ చేస్తుందంటూ అభినందించారు. ప్రియాంకా చోప్రాకు పుట్టన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భర్త చేసిన పుట్టిన రోజు వేడుకతో ప్రియాంకా చోప్రా ఎమోషనల్ అయ్యింది. తన పుట్టిన రోజున కుటుంబం, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ తనకు విష్ చేయడం సంతోషంగా ఉందని, అలాగే ఈ యూనివర్స్ తనకు గొప్ప బహుమతిగా తన కుటుంబాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను 43వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా మరింత ఆనందంగా ఉందని వివరించింది.

గ్లోబల్ బ్యూటీగా గుర్తింపు పొందిన ప్రియాంకా చోప్రా తనకంటే 11ఏళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను 2018లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి 2022లో ఓ కూతురు పుట్టింది. 2000సంవత్సరంలో మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన ప్రియాంకా చోప్రా బాలీవుడ్, హాలీవుడ్ లలో నటిస్తూ గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. 2016లో ఆమెకు పద్మశ్రీ అవార్డు దక్కడం విశేషం. తెలుగులో రామ్ చరణ్ తుఫాన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంకా చోప్రా ప్రస్తుతం రాజమౌళీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ 29లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన  నటిస్తోంది. ప్రియాంక ‘ది బ్లఫ్’లో 19వ శతాబ్దపు కరేబియన్ సముద్రపు దొంగగా కూడా కనిపించనుంది. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ రెండవ సీజన్ కూడా నటించబోతుంది.