Husbands Killed By Wives| మరో ఇద్ధరు భర్తల దారుణ హత్య!

Husbands Killed By Wives| మరో ఇద్ధరు భర్తల దారుణ హత్య!

విధాత : ఇటీవల కాలంలో భార్యల చేతుల్లో హతమవుతున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరో ఇద్దరు భర్తలు తమ భార్యల చేతుల్లో హతమయ్యారు. ఓ భార్య తన భర్తను చంపి ఇంటిలోనే పాతిపెట్టి దృశ్యం సినిమాను గుర్తుకు తెచ్చింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా నలసోపర ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. సాయి వెల్ఫేర్ సొసైటీలో నివాసం ఉంటున్న కోమల్ చవాన్(28) అనే మహిళ ప్రియుడు మోనుతో కలిసి భర్త విజయ్ చవాన్‌ను హత్య చేసింది.

మృతదేహాన్ని ఇంటి గదిలోని టైల్స్ కింద పాతిపెట్టింది. విజయ్ చవాన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అతని సోదరులకు అనుమానం వచ్చంది. ఇంట్లోని కొన్ని టైల్స్ దెబ్బతిని, వాటి రంగు మిగతా వాటికి భిన్నంగా ఉండటంతో అనుమానంతో టైల్స్‌ను తొలగించి చూడగా..కోమల్ చవాన్ మృతదేహం బయట పడింది. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు నిందితులైన భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు.

 


అనుమానపు మొగుడిని లేపేసిన భార్య

ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాంటూ ప్రశ్నించిన భర్తను ఏకంగా పైకి పంపించేసింది భార్య. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్(33), జయశ్రీలకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడేళ్ల క్రితం వారి మధ్య విబేధాలు రావడంతో, పిల్లలను తీసుకొని జయశ్రీ పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు నెలల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో కుదిరిన పరిష్కారం మేరకు మళ్లీ భార్య పిల్లలను వెంకటేష్ కాపురానికి తీసుకొచ్చాడు. ఆదివారం బోనాల పండుగ సందర్భంగా వెంకటేష్ రాత్రి 11 గంటలకు ఇంటికి రాగా.. ఆ సమయంలో జయశ్రీ ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. ఈ రాత్రి సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావని జయశ్రీని భర్త వెంకటేష్ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ముదిరిపోయింది. జయశ్రీ తన భర్త వెంకటేష్ చేతులను అదిమి పట్టుకోగా, అక్కడే ఉన్న మామ(జయశ్రీ తండ్రి) పండరీ అతని గొంతు నులిమి చంపేశాడు. విషయం బయటకు రాకుండా సోమవారం ఉదయం ఆటోలో వెంకటేష్ మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేశారు. వెంకటేష్ తల్లి, అతని సోదరులు అది గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెంకటేష్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జయశ్రీని, ఆమె తండ్రి పండరీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఇది కూడా చదవండి..

Illicit Relationships | పతి పత్ని ఔర్ వో! మంట కలుస్తున్న సంసారాలు.. చివరకు చావులు!
Husband | నా భార్య ర‌క్తం కారేలా కొడుతోంది.. పోలీసుల‌కు భ‌ర్త ఫిర్యాదు