Yadagirigutta Temple| యాదగిరి గుట్ట ఈవోగా ఐఏఎస్ వెంకట్రావు కొనసాగింపు

Yadagirigutta Temple| యాదగిరి గుట్ట ఈవోగా ఐఏఎస్ వెంకట్రావు కొనసాగింపు

విధాత, నల్లగొండ: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట దేవస్థానం( Yadagirigutta Temple) ఈవో(EO)గా ఐఏఎస్ ఎస్.వెంకట్రావు(IAS Venkat Rao)ను కొనసాగిస్తూ(Extension) ప్రభుత్వం ఉత్తర్వులు (Telangana Government Orders) జారీ చేసింది. యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న 2015బ్యాచ్ ఐఏఎస్ అధికారి వెంకట్రావు శనివారం పదవి విరమణ  చేశారు.

ఆ వెంటనే ఆయనను యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా, శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ అధికారిగానూ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఎంతకాలం పాటు ఆయన పదవీ కాలం పొడిగిస్తారన్నదానిపై తదుపరి ఉత్తర్వులలో వెల్లడిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు తెలిపారు.