Mumbai | భారీ వర్షానికి ముంబై అతలాకుతలం.. ఒకరు మృతి
Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. కాలనీల్లోకి వరద నీరు పోటెత్తడంతో నదులను తలపించాయి. అంధేరిలోని సబ్‌వే నీట మునిగింది. సబర్బన్ మలాద్‌లో ఓ చెట్టు నేలకొరిగింది. దీంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షానికి అతలాకుతలమైన ముంబై నగరంలో బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు. వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల […]

Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. కాలనీల్లోకి వరద నీరు పోటెత్తడంతో నదులను తలపించాయి. అంధేరిలోని సబ్‌వే నీట మునిగింది. సబర్బన్ మలాద్‌లో ఓ చెట్టు నేలకొరిగింది. దీంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షానికి అతలాకుతలమైన ముంబై నగరంలో బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు.
వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోకల్ రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
అంధేరి సబ్‌వే వద్ద 2 ఫీట్ల వరకు వర్షపు నీరు నిలిచిపోవడంతో, ఆ మార్గంలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఎస్‌వీ రోడ్డు మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ముంబై నగర వ్యాప్తంగా గత 24 గంటల్లో 26 చోట్ల చెట్లు నేలకొరిగాయి. 15 విద్యుత్ షాక్ ఘటనలు సంభవించాయి. ఐదు చోట్ల భవనాలు కుప్పకూలినట్లు బీఎంసీ అధికారులు వెల్లడించారు.