Bihar | బీహార్‌లో నీట మునిగిన ప‌డ‌వ‌.. 10 మంది విద్యార్థులు గల్లంతు

Bihar పాట్నా : బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్‌లో విషాదం నెల‌కొంది. బాగ‌మ‌తి న‌దిలో గురువారం ఉద‌యం స్కూల్ విద్యార్థుల‌తో వెళ్తున్న ఓ ప‌డ‌వ నీట మునిగింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ప‌డ‌వ నీటిలో మున‌గ‌డాన్ని గ‌మ‌నించిన స్థానికులు అప్ర‌మ‌త్త‌మై.. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. 20 మంది విద్యార్థుల‌ను ప్రాణాల‌తో కాపాడారు. మ‌రో 10 మంది ఆచూకీ కోసం స్థానికులు న‌దిలో గాలిస్తున్నారు. పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్నం […]

Bihar | బీహార్‌లో నీట మునిగిన ప‌డ‌వ‌.. 10 మంది విద్యార్థులు గల్లంతు

Bihar

పాట్నా : బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్‌లో విషాదం నెల‌కొంది. బాగ‌మ‌తి న‌దిలో గురువారం ఉద‌యం స్కూల్ విద్యార్థుల‌తో వెళ్తున్న ఓ ప‌డ‌వ నీట మునిగింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 30 మంది విద్యార్థులు ఉన్నారు.

ప‌డ‌వ నీటిలో మున‌గ‌డాన్ని గ‌మ‌నించిన స్థానికులు అప్ర‌మ‌త్త‌మై.. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. 20 మంది విద్యార్థుల‌ను ప్రాణాల‌తో కాపాడారు. మ‌రో 10 మంది ఆచూకీ కోసం స్థానికులు న‌దిలో గాలిస్తున్నారు. పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్నం అయ్యాయి. విద్యార్థుల త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.