100 కోట్ల హీరో మొదటి రోజు కలెక్షన్ 50 లక్షలు..!
విధాత: దక్షిణాదిలో భారీ బడ్జెట్ లో రూపొందే చిత్రాలంటే తమిళ, తెలుగు చిత్రాలనే చెప్పుకోవాలి. ఈ రెండు భాషల చిత్రాలకు మార్కెట్ ఎక్కువ. కోలీవుడ్ మార్కెట్ టాలీవుడ్ మార్కెట్ లు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఏకంగా హీరోలు 100 కోట్ల రెమ్యూనేషన్ డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ ఈజీగా 200 నుంచి 350 400 కోట్లు అవుతోంది. అందులోను అందరు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలపై కన్నేశారు. దాంతో స్టార్ హీరోల చిత్రాలకు ఏకంగా 500 కోట్లను […]

విధాత: దక్షిణాదిలో భారీ బడ్జెట్ లో రూపొందే చిత్రాలంటే తమిళ, తెలుగు చిత్రాలనే చెప్పుకోవాలి. ఈ రెండు భాషల చిత్రాలకు మార్కెట్ ఎక్కువ. కోలీవుడ్ మార్కెట్ టాలీవుడ్ మార్కెట్ లు ఇటీవల విపరీతంగా పెరిగాయి. ఏకంగా హీరోలు 100 కోట్ల రెమ్యూనేషన్ డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ ఈజీగా 200 నుంచి 350 400 కోట్లు అవుతోంది. అందులోను అందరు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలపై కన్నేశారు. దాంతో స్టార్ హీరోల చిత్రాలకు ఏకంగా 500 కోట్లను కేటాయిస్తున్నారు. మీడియం రేంజ్ హీరోల చిత్రాలకు కూడా 70,80 కోట్లు కేటాయిస్తున్నారు.
కానీ ఈ మధ్యకాలంలో కన్నడ పరిశ్రమ కాస్త పుంజుకుంది. ముఖ్యంగా కే జి ఎఫ్ చాప్టర్1, కేజీఎఫ్ చాప్టర్2, కాంతారా చిత్రాలతో శాండల్ వుడ్ స్టామినా పెరిగింది. ప్రస్తుతం కన్నడ నుంచి వచ్చే చిత్రాల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక మలయాళం సినిమాకి వస్తే ఈ మాలీవుడ్ మార్కెట్ ఒకప్పుడు 10 నుండి 30 కోట్ల మధ్య ఉండేది. స్టార్ హీరోల చిత్రాలు పాతిక నుంచి 30 కోట్లు వసూలు చేస్తే బ్లాక్ బస్టర్ కింద లెక్క. కానీ ఇప్పుడు మలయాళ సినిమాలు కూడా 100 కోట్లు అందుకుంటున్నాయి.
ఇదంతా కేవలం మోహన్ లాల్ పుణ్యమే అని చెప్పాలి. ఆయన నటించిన పలు చిత్రాలు పలు భాషల్లో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. మరికొన్ని భాషల్లో ఈ చిత్రాలను భారీ ధరలకు రీమేక్ హక్కులు సొంతం చేసుకొని నిర్మాతలు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. దాంతో మోహన్ లాల్ మలయాళం లో 100 కోట్ల మార్కెట్‌ను సృష్టించిన హీరోగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి సూపర్ స్టార్ మోహన్ లాల్ పరిస్థితి ఈమధ్య సరిగా లేదు. ఆయన ఎంపిక చేసుకుంటున్న సినిమాలు నాసిరకంగా ఉంటున్నాయి.
ప్రేక్షకులు, అభిమానులు ఆయన నుండి ఆశించే చిత్రాలను అతను అందించలేకపోతున్నారు. దాంతో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మార్కెట్ రోజు రోజుకు దిగజారుతోంది. ఆ మధ్యన అలోన్ అనే చిత్రంతో మోహన్ లాల్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలోన్ చిత్రం మలయాళ ప్రేక్షకులకు పిచ్చెక్కించిందని రివ్యూలు వచ్చాయి. దీనికి షాజీ కైలాస్ దర్శకుడు. రేటింగ్స్ మరీ దారుణంగా వచ్చాయి. ఈ చిత్రానికి మొదటి రోజు ఓపెనింగ్స్ కేవలం 50 లక్షలు మాత్రమే నట. ట్రైలర్ విడుదలైన సమయంలోనే ప్రేక్షకులకు ఈ చిత్రం పరిస్థితి అర్ధమైపోయింది.
దాంతో ఈ చిత్రంపై వారికి ఆసక్తి పోయింది. అందుకే ఈ సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా అందుకోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇప్పటికైనా సూపర్ స్టార్ మోహన్ లాల్ మెగాస్టార్ చిరంజీవి తరహాలో ప్రేక్షకులకు తన నుంచి ఏమి కావాలో అలాంటి చిత్రాలను అందిస్తాడని భావించాలి. చిరు కూడా వాల్తేరు వీరయ్య లాంటి చిత్రంతో తన నుంచి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇదే పనిని కాస్త మోహన్ లాల్ కూడా చేసుకుని అంతర్మథనం కావిస్తే ఆయన తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవచ్చు. లేకపోతే యువహీరోల ధాటికి ఆయన కూడా ఇబ్బందులు పడక తప్పదు.