Rajasthan | రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం
Rajasthan విధాత: జైపూర్ : రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బస్సు - ట్రక్కు ఢీకొట్టుకోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు రాజస్థాన్‌లోని పుష్కర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. లఖంపూర్ ఏరియాలోని అంత్రా ఫ్లై ఓవర్ వద్ద బస్సు ఆగిపోవడంతో.. దానికి డ్రైవర్ మరమ్మతులు చేపట్టారు. దీంతో కొంత […]

Rajasthan
విధాత: జైపూర్ : రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బస్సు – ట్రక్కు ఢీకొట్టుకోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు రాజస్థాన్‌లోని పుష్కర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
లఖంపూర్ ఏరియాలోని అంత్రా ఫ్లై ఓవర్ వద్ద బస్సు ఆగిపోవడంతో.. దానికి డ్రైవర్ మరమ్మతులు చేపట్టారు. దీంతో కొంత మంది ప్రయాణికులు బస్సులో ఉండగా, మరికొందరు బయటకు వచ్చి రోడ్డుపై నిల్చున్నారు. అంతలోనే వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టింది. దీంతో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.