Maharashtra | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

లోయలో పడిన ప్రైవేట్‌ బస్సు విధాత‌: మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని రాయగఢ్‌లో ప్రైవేట్‌ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, మరో 27 మందికి గాయాలయ్యాయి. వివరాళ్లోకి వెళితే.. పూణె నుంచి ముంబయి వెళ్తున్న ప్రైవేట్‌ బస్సులో ఓ సంగీత బృందం ప్రయాణిస్తున్నది. వారంతా ముంబయిలోని గొరెగావ్‌ చెందిన వారు. పూణెకు దగ్గరిలోని పంప్రి చింఛ్వాడ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి వస్తున్న క్రమంలో తెల్లవారుజామున […]

Maharashtra | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
  • లోయలో పడిన ప్రైవేట్‌ బస్సు

విధాత‌: మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని రాయగఢ్‌లో ప్రైవేట్‌ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, మరో 27 మందికి గాయాలయ్యాయి. వివరాళ్లోకి వెళితే.. పూణె నుంచి ముంబయి వెళ్తున్న ప్రైవేట్‌ బస్సులో ఓ సంగీత బృందం ప్రయాణిస్తున్నది. వారంతా ముంబయిలోని గొరెగావ్‌ చెందిన వారు. పూణెకు దగ్గరిలోని పంప్రి చింఛ్వాడ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తిరిగి వస్తున్న క్రమంలో తెల్లవారుజామున 4.50 గంటల సమయంలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఖపోలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 27 మంది గాయపడినట్టు రాయ్‌గఢ్‌ ఎస్పీ వెల్లడించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్చారు. మృతులంతా 25 ఏళ్లలోపు వారే.

ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలిలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి.