Tirumala | శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం!
తిరుమలకు పోటెత్తిన భక్తులు 25 కంపార్ట్ మెంట్లు కిటకిట Tirumala | విధాత: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 78,726 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,436 […]

- తిరుమలకు పోటెత్తిన భక్తులు
- 25 కంపార్ట్ మెంట్లు కిటకిట
Tirumala | విధాత: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిన్న శ్రీవారిని 78,726 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,436 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.94 కోట్లు వచ్చింది. భక్తుల రద్దీ కొనసాగుతోంది.