బాలిక‌పై ట్యూష‌న్ టీచ‌ర్ లైంగిక వేధింపులు

పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ట్యూష‌న్ టీచ‌ర్ దారి త‌ప్పాడు. త‌న వ‌ద్ద‌కు ట్యూష‌న్ చెప్పించుకునేందుకు వ‌చ్చే 16 ఏండ్ల బాలిక‌పై అత‌డు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు

బాలిక‌పై ట్యూష‌న్ టీచ‌ర్ లైంగిక వేధింపులు
  • ముంబైలో ఘ‌ట‌న‌.. నిందితుడిపై పోక్సో కేసు


విధాత‌: పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ట్యూష‌న్ టీచ‌ర్ దారి త‌ప్పాడు. త‌న వ‌ద్ద‌కు ట్యూష‌న్ చెప్పించుకునేందుకు వ‌చ్చే 16 ఏండ్ల బాలిక‌పై అత‌డు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలోని ఆంటోప్ హిల్‌లో చోటుచేసుకున్న‌ది. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు న‌మోదుచేశారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సియోన్‌కు చెందిన బాధితురాలు వాడాలాలోని ఆంటోప్ హిల్ ప్రాంతంలో ప్రైవేట్ క్లాసులు తీసుకునే నిందితుడి వద్దకు వెళ్లేది. నవంబర్ ఒక‌టి నుంచి నిందితుడు ఆమెకు సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాడు. బ‌ల‌వంతంగా ఆమెను అనుచితంగా తాక‌డం మొద‌లుపెట్టాడు. అత‌డి వేధింపులు క్ర‌మంగా పెర‌గ‌డంతో భ‌యాందోళ‌న‌కు గురైన బాలిక ట్యూష‌న్‌కు వెళ్ల‌డం మానేంది. ఏవో సాకులు చెప్తూ ఇంట్లోనే ఉండిపోయింది.


ట్యూషన్‌కు వెళ్ల‌క‌పోవ‌డంపై త‌ల్లిదండ్రులు బాలిక‌ను నిల‌దీయ‌గా అనారోగ్య కార‌ణాలు అని ఒక రోజు త‌ప్పించుకోగ‌లింది. గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌డంతో ట్యూష‌న్ టీచ‌ర్ అఘాయిత్యాలను చెప్పి వాపోయింది. నవంబర్ ఒక‌టి నుంచి 14 మధ్య జరిగిన అఘాయిత్యాల‌ మొత్తాన్ని ఆమె తన తల్లిదండ్రులకు వివరించింది. బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆరోపణల ఆధారంగా నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు. అనంత‌రం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.