Rajasthan | ద‌ళిత యువ‌తిపై గ్యాంగ్ రేప్‌

Rajasthan ముఖంపై యాసిడ్ పోసిన దుండ‌గులు యువ‌తి మృత‌దేహం బావిలో డంప్‌ రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో దారుణం విధాత‌: రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో దారుణం చోటుచేసుకున్న‌ది. 18 ఏండ్ల ద‌ళిత యువ‌త‌పై గుర్తుతెలియ‌ని దుండ‌గులు సామూహిక‌లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆమె ముఖంపై యాసిడ్ పోసి చంపేశారు. త‌ర్వాత మృత‌దేహాన్ని బావిలో విసిరేశారు. నదౌతి పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలపాడ రోడ్డులోని బావిలో ద‌ళిత యువ‌తి మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. […]

Rajasthan | ద‌ళిత యువ‌తిపై గ్యాంగ్ రేప్‌

Rajasthan

  • ముఖంపై యాసిడ్ పోసిన దుండ‌గులు
  • యువ‌తి మృత‌దేహం బావిలో డంప్‌
  • రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో దారుణం

విధాత‌: రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో దారుణం చోటుచేసుకున్న‌ది. 18 ఏండ్ల ద‌ళిత యువ‌త‌పై గుర్తుతెలియ‌ని దుండ‌గులు సామూహిక‌లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆమె ముఖంపై యాసిడ్ పోసి చంపేశారు. త‌ర్వాత మృత‌దేహాన్ని బావిలో విసిరేశారు. నదౌతి పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలపాడ రోడ్డులోని బావిలో ద‌ళిత యువ‌తి మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. పోస్టుమార్టం రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామ‌ని, కేసు ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

పోలీసులు ఏమ‌న్నారంటే..

‘బిలపాడ రహదారిలో ఉన్న బావిలో బాలిక మృతదేహం గురించి మాకు గురువారం రాత్రి 9.00 గంటలకు సమాచారం వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మోహన్‌పురా గ్రామానికి చెందిన యువ‌తిగా ఆమెను గుర్తించాం. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హిందౌన్‌లోని జిల్లా ద‌వాఖాన‌ మార్చురీకి తరలించాం. మెడికల్ రిపోర్టుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని బాబులాల్ అనే పోలీస్ అధికారి తెలిపారు.