192 Crore Coin | ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన రూ.192 కోట్ల నాణెం

192 Crore Coin మొద‌టి వ‌ర్ధంతి సంద‌ర్భంగా క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం విడుద‌ల‌ 4 కిలోల బంగారం, 6,400 వజ్రాలతో త‌యారీ నాణెం విలువ సుమారు రూ.192 కోట్లు 192 Crore Coin | విధాత‌: ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన నాణెం (కాయిన్‌) త‌యారైంది. బ్రిట‌న్ రాణి దివంగత ఎలిజబెత్ II గౌరవార్థం ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ నాణేన్ని త‌యారు చేయించింది. క్వీన్ మొద‌టి వ‌ర్ధంతి సంద‌ర్భంగా శుక్ర‌వారం కొత్త కాయిన్‌ను విడుద‌ల చేశారు. […]

192 Crore Coin | ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన రూ.192 కోట్ల నాణెం

192 Crore Coin

  • మొద‌టి వ‌ర్ధంతి సంద‌ర్భంగా క్వీన్ ఎలిజబెత్ II గౌరవార్థం విడుద‌ల‌
  • 4 కిలోల బంగారం, 6,400 వజ్రాలతో త‌యారీ
  • నాణెం విలువ సుమారు రూ.192 కోట్లు

192 Crore Coin | విధాత‌: ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన నాణెం (కాయిన్‌) త‌యారైంది. బ్రిట‌న్ రాణి దివంగత ఎలిజబెత్ II గౌరవార్థం ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ నాణేన్ని త‌యారు చేయించింది. క్వీన్ మొద‌టి వ‌ర్ధంతి సంద‌ర్భంగా శుక్ర‌వారం కొత్త కాయిన్‌ను విడుద‌ల చేశారు. అనేక ప్ర‌త్యేక‌లు ఉన్న ఈ నాణెం ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన‌దిగా చెప్తున్నారు. దాదాపు 4 కిలోల బంగారం, 6,400 కుపైగా వజ్రాలతో తయారు చేసిన ఈ నాణెం విలువ సుమారు ($23 మిలియన్లు) రూ.192 కోట్లు ఉంటుంద‌ని సీఎన్ఎన్ తెలిపింది.

ఈ కాయిన్‌ను వేలానికి పెడ‌తారో లేదో తెలియ‌దు. కామన్వెల్త్‌లోని హస్తకళాకారులు సుమారు 16 నెల‌ల‌పాటు శ్ర‌మించి నాణేన్ని ఉత్ప‌త్తి చేశారు. నాణెం 9.6 అంగుళాల కంటే ఎక్కువ వెడ‌ల్పుతో బాస్కెట్‌బాల్ పరిమాణంలో రూపొందించారు. ప్రఖ్యాత పోర్ట్రెయిట్ కళాకారులు మేరీ గిల్లిక్, ఆర్నాల్డ్ మచిన్, రాఫెల్ మక్లౌఫ్,ఇయాన్ ర్యాంక్-బ్రాడ్లీ రూపొందించిన దివంగత చక్రవర్తి చిత్రాల తర‌హాలో త‌యారుచేశారు.

మధ్య నాణెం సుమారు కిలో (2 పౌండ్ల కంటే ఎక్కువ) బరువు ఉంటుంది. దాని చుట్టూ ఉన్న చిన్నవి ఒక్కొక్కటి 1 ఔన్స్ బరువు కలిగి ఉంటాయి. నాణేనికి ఒక‌వైపు బంగారం వ‌ర్ణంలో ఎలిజ‌బెత్ రాణి చిత్రం, మ‌రోవైపు ఆమె కిరీటంతోపాటు సింహం ఇత‌ర చిత్రాలు ఉన్నాయి. నాణెం రెండు అంచుల చుట్టు “వయస్సుతో అనుభవం వస్తుంది. సరిగ్గా ఉపయోగించినట్లయితే అది ఒక పుణ్యం అవుతుంది”. “గత విభేదాలను మా వెన‌కాల పెట్టేసి, క‌లిసి ముందుకు సాగండి” అనే వ్యాఖ్య‌లు రాశారు.