Threads | ట్విట్టర్‌కు పోటీగా ‘థ్రెడ్స్’.. ప్రారంభించిన 4 గంటల్లోనే 50 లక్షల ఖాతాలు
Threads | ట్విట్టర్‌కు పోటీగా 'థ్రెడ్స్' యాప్ వచ్చేసింది. ఈ థ్రెడ్స్ యాప్‌ను మెటా అనే సోషల్ మీడియా సంస్థ రూపొందించింది. ట్విట్టర్‌కు పోటీగా తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్ ఐవోఎస్ వినియోగదార్లకు గురువారం అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను ప్రారంభించిన మొదటి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఖాతాలను ఓపెన్ చేశారు. తొలి నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. గంట గంటకు థ్రెడ్స్ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ విషయాన్ని […]

Threads | ట్విట్టర్‌కు పోటీగా ‘థ్రెడ్స్’ యాప్ వచ్చేసింది. ఈ థ్రెడ్స్ యాప్‌ను మెటా అనే సోషల్ మీడియా సంస్థ రూపొందించింది. ట్విట్టర్‌కు పోటీగా తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్ ఐవోఎస్ వినియోగదార్లకు గురువారం అందుబాటులోకి వచ్చింది.
ఈ యాప్‌ను ప్రారంభించిన మొదటి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఖాతాలను ఓపెన్ చేశారు. తొలి నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు చేరింది. గంట గంటకు థ్రెడ్స్ యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ విషయాన్ని మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ట్విట్టర్ ఎలాన్ మస్క్ ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే.
థ్రెడ్స్ యాప్‌లో ట్విట్టర్ తరహా ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్‌ను మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌కు అనుసంధానంగా తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్‌తో ఈ యాప్‌ను లాగిన్ అవొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తంగా త్వరలోనే ట్విట్టర్ ఖాతాదారుల సంఖ్యను థ్రెడ్స్ మించిపోయే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియా నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడారు. సంభాషణలు జరిపేందుకు స్నేహపూర్వకమైన పబ్లిక్ స్పేస్ ఇది. టెక్ట్స్ సంభాషణలు చేసుకునేవారికి ఇదో కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి ఇలాంటి స్నేహపూర్వక కమ్యూనిటీ అవసరం ఉంది. థ్రెడ్స్ యాప్ ఆ సౌలభ్యాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు.