Sydney Beach | బీచ్‌లో నగ్నంగా 2500 మంది.. ఎందుకంటే!

Sydney Beach విధాత: బహిరంగ ప్రదేశాల్లో వివిధ అంశాలపై అర్ధ‌నగ్న ప్రదర్శనలు చూస్తూనే ఉంటాం. పెటా వంటి ఉద్యమకారులు జంతువుల పరరక్షణ అంశాలపై అర్థనగ్న ప్రదర్శనలు చేయడం పరిపాటి. అయితే.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో ఏకంగా నగ్న ప్రదర్శనకు దిగారు. ప్రఖ్యాత బోండీ బీచ్‌లో దాదాపు 2500 మంది పాల్గొన్న ఈ నగ్న ప్రదర్శన వెనుక ఓ సామాజిక ఔచిత్యం కూడా ఉండటం విశేషం. చర్మ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ నగ్న […]

Sydney Beach | బీచ్‌లో నగ్నంగా 2500 మంది.. ఎందుకంటే!

Sydney Beach

విధాత: బహిరంగ ప్రదేశాల్లో వివిధ అంశాలపై అర్ధ‌నగ్న ప్రదర్శనలు చూస్తూనే ఉంటాం. పెటా వంటి ఉద్యమకారులు జంతువుల పరరక్షణ అంశాలపై అర్థనగ్న ప్రదర్శనలు చేయడం పరిపాటి. అయితే.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో ఏకంగా నగ్న ప్రదర్శనకు దిగారు.

ప్రఖ్యాత బోండీ బీచ్‌లో దాదాపు 2500 మంది పాల్గొన్న ఈ నగ్న ప్రదర్శన వెనుక ఓ సామాజిక ఔచిత్యం కూడా ఉండటం విశేషం. చర్మ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ నగ్న ప్రదర్శనలకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నారట. ఈ సార్వజనీన నగ్న ప్రదర్శన కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం తన చట్టాల్లో మార్పులు కూడా చేసింది.

వరల్డ్ స్కిన్ క్యాన్సర్ ఫండ్ సంస్థ చెబుతున్న ప్రకారం.. ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్‌ సమస్య ఎక్కువగా ఉన్నది. ప్రభుత్వ అంచనా ప్రకారమే.. ఏటా 17,756 మంది చర్మ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. వీరిలో 1281మంది చనిపోతున్నారు.

ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారిలో చర్మ క్యాన్సర్‌తో బాధ పడుతున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరికి మద్దతుగా ఇటువంటి వారికి సహాయం అందిస్తున్న సంస్థల ప్రతినిధులు, సమస్య నుంచి బయటపడిన వారు కూడా ఉన్నారు.

ఇటువంటి ప్రదర్శన నిర్వహించాలనే ఆలోచన అమెరికాకు చెందిన స్పేన్ సర్ ట్యూనిక్ అనే ఫొటోగ్రాఫర్‌ది. ఆస్ట్రేలియా పౌరులు ఎప్పటికప్పుడు చర్మ క్యాన్సర్‌ టెస్టులు చేయించుకునేలా చైతన్యం కల్పించడమే ఈ ప్రదర్శన వెనుక ఉద్దేశంగా చెబుతున్నారు.

ఈ బహిరంగ, భారీ నగ్న ప్రదర్శనల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ప్రజల్లో చర్మ క్యాన్సర్‌ గురించి చర్చించుకునేందుకు దోహదం చేస్తున్నాయి.