Bihar | బిహార్‌లో అటవిక రాజ్యం.. వారంలో రెండో సాక్షి హత్య.
Bihar | విధాత: బిహార్ లో రోజురోజుకి శాంతి భద్రతలు క్షీణిస్తున్నట్లు కనపడుతోంది. వివిధ హత్య కేసుల్లో సాక్షులుగా ఉన్న వ్యక్తులను దుండగులు వరసగా కాల్చి చంపుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడం కలవరపెడుతోంది. ఆదివారం జరిగిన తాజా ఘటనలో కుమారుడి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన ఒక 70 ఏళ్ల వృద్ధుణ్ని దుండగులు పట్టపగలే కాల్చి చంపారు. బెగుసరాయ్ జిల్లాలో నివాసం ఉంటున్న జవహర్ చౌదరి.. తన కుమారుడి హత్య […]

Bihar | విధాత: బిహార్ లో రోజురోజుకి శాంతి భద్రతలు క్షీణిస్తున్నట్లు కనపడుతోంది. వివిధ హత్య కేసుల్లో సాక్షులుగా ఉన్న వ్యక్తులను దుండగులు వరసగా కాల్చి చంపుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడం కలవరపెడుతోంది. ఆదివారం జరిగిన తాజా ఘటనలో కుమారుడి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన ఒక 70 ఏళ్ల వృద్ధుణ్ని దుండగులు పట్టపగలే కాల్చి చంపారు.
బెగుసరాయ్ జిల్లాలో నివాసం ఉంటున్న జవహర్ చౌదరి.. తన కుమారుడి హత్య కేసులో ప్రత్యక్షసాక్షి. ఉదయం ఆయన నడకకు వెళ్లగా అప్పటికే మాటు వేసి ఉన్న దుండగులు ఆయనను హత్య చేశారు. ఆయన కుమారుడు నీరజ్‌ను 2001లో నీరజ్ తమ్ముడే ఆస్తి గొడవల నేపథ్యంలో చంపేశాడని కేసు నమోదైంది. ఈ వాదన నిజమేనని జవహర్ కోర్టులో సాక్ష్యం చెప్పడంతో కోర్టు నిందితుడికి జైలు శిక్ష వేసింది.
తాజాగా జవహర్ మృతికి జైలులో ఉన్న నిందితుడికి సంబంధం ఉండే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గత వారం రోజుల్లో ఇది రెండో ఘటన కాగా మొదటి ఘటనలో తన సోదరుడి హత్య కేసులో సాక్షిగా ఉన్న ఓ జర్నలిస్టును దుండగులు బలి తీసుకున్నారు. ప్రముఖ పత్రిక దైనిక్ జాగరణ్‌లో విలేకరిగా ఉన్న విమల్ కుమార్ యాదవ్‌ను అరారియా జిల్లాలో అతని నివాసంలో ఉండగా హత్య చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా.. దీనిని దిగ్భ్రాంతికర ఘటనగా రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ అభివర్ణించారు. ఈ వరుస హత్యలపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. అమాయకుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించింది.