జమ్మూ కాశ్మీర్‌లో దారుణం.. 15 రోజుల శిశువుస‌హా ముగ్గురి మృతి

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వాహనం అదుపుత‌ప్పి లోయలో ప‌డిపోవ‌డంతో 15 రోజుల బాలుడితో సహా ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు

  • By: Somu    latest    Feb 10, 2024 10:04 AM IST
జమ్మూ కాశ్మీర్‌లో దారుణం.. 15 రోజుల శిశువుస‌హా ముగ్గురి మృతి
  • 12 మందికి గాయాలు.. లోయ‌లో ప‌డిన వాహ‌నం
  • జ‌మ్ముక‌శ్మీర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

విధాత‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వాహనం అదుపుత‌ప్పి లోయలో ప‌డిపోవ‌డంతో 15 రోజుల బాలుడితో సహా ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. కిష్త్వార్ జిల్లాలో ఎస్‌యూవీ అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఓ పసికందు సహా ముగ్గురు చ‌నిపోయారు. మ‌రో 12 మంది గాయపడ్డారు.


పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. శుక్రవారం సాయంత్రం గులాబ్‌గఢ్-మచైల్ రహదారిలోని హకూ గ్రామం వద్ద ఓవర్‌లోడ్ ప్యాసింజర్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు.. దయా క్రిషన్ (36), సబితా దేవి (30), 15 రోజుల బాలుడు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.


తీవ్రంగా గాయపడిన నలుగురిని ప్రత్యేక చికిత్స కోసం ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) జమ్ములో చేర్చినట్టు అధికారులు తెలిపారు. కిష్త్వార్ జిల్లా యంత్రాంగం జిల్లా రెడ్ క్రాస్ ఫండ్ కింద మరణించిన వారికి రూ.50,000, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10,000 తక్షణ ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.