Larissa Borges | విధాత: ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకున్న బ్రెజిల్ ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ లరీసా బోర్జ్స్ (33) గుండెపోటుతో మృతి చెందారు. వారం క్రితం గుండెపోటు రాగా అప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉన్నారు. అత్యాధునిక చికిత్సతో వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఆమెను కాపాడుకోలేకపోయామని కుటుంబసభ్యులు వాపోయారు. ఆమె ఇన్స్టా పేజీలో వారు లరీసా మరణ వార్తను శనివారం పోస్ట్ చేశారు. ఆగస్టు 20న తొలి సారి గుండెపోటు వచ్చి కోమాలోకి వెళ్లిపోగా.. 28న మరోసారి తీవ్రమైన గుండె […]
Larissa Borges | విధాత: ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సంపాదించుకున్న బ్రెజిల్ ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ లరీసా బోర్జ్స్ (33) గుండెపోటుతో మృతి చెందారు. వారం క్రితం గుండెపోటు రాగా అప్పటి నుంచి ఆమె కోమాలోనే ఉన్నారు. అత్యాధునిక చికిత్సతో వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఆమెను కాపాడుకోలేకపోయామని కుటుంబసభ్యులు వాపోయారు. ఆమె ఇన్స్టా పేజీలో వారు లరీసా మరణ వార్తను శనివారం పోస్ట్ చేశారు.
ఆగస్టు 20న తొలి సారి గుండెపోటు వచ్చి కోమాలోకి వెళ్లిపోగా.. 28న మరోసారి తీవ్రమైన గుండె పోటు రావడంతో లరీసా పరిస్థితి చేయిదాటిపోయింది. గుండె కొట్టుకోవడం హఠాత్తుగా ఆగిపోతే దానిని వైద్య పరిభాషలో కార్డియాక్ అరెస్ట్ అంటారు. దీనికి వెంటనే చికిత్స అందించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. లరీసా విషయంలో జరిగిన దానిని డబుల్ కార్డియాక్ అరెస్ట్ (Double Cardiac Arrest) అంటారని సీనియర్ కార్డియాలజిస్ట్ సమీర్ గుప్తా వివరించారు.
ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. గుండెలో ఉండే జఠరికలు కర్ణికల్లో ఒకే సమయంలో గుండె పోటు వచ్చినపుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది అని తెలిపారు. దీని వల్ల గుండె ద్వారా ఏమాత్రం రక్తప్రసరణ జరగదని.. నిమిషాల్లోనే మరణం సంభవిస్తుందని పేర్కొన్నారు. కుటుంబ చరిత్రలో ఎవరికైనా గుండె సమస్యలు ఉన్నా.. లేదంటే బాధితులకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నా డబుల్ కార్డియాక్ అరెస్ట్ జరిగే అవకాశమున్నట్లు ఆయన పేర్కొన్నారు.