SCR | రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 36 రైళ్లు రద్దు
SCR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 22 ఎంఎంటీఎస్, మరో 36 ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. మరమ్మతుల కారణంగా జూన్ 26 నుంచి జులై 2వ తేదీ వరకు ఏడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నేపథ్యంలో నగరంలో తిరుగాల్సిన మొత్తం 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేశారు. ఈ నెల 26 నుంచి […]

SCR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 22 ఎంఎంటీఎస్, మరో 36 ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. మరమ్మతుల కారణంగా జూన్ 26 నుంచి జులై 2వ తేదీ వరకు ఏడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేశారు.
సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నేపథ్యంలో నగరంలో తిరుగాల్సిన మొత్తం 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు రద్దు చేశారు.
ఈ నెల 26 నుంచి జూలై 2 వరకు ఏడు రోజులు ఈ సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. లింగంపల్లి-హైదరాబాద్, ఉందానగర్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి స్టేషన్ల మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేశామని, రైళ్ల రద్దు వల్ల నగర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరో 36 రైళ్లు రద్దు
వివిధ రకాల మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 36 రైళ్లను రద్దు చేయగా, వీటిలో కొన్నింటిని ఒక్క రోజు, మరికొన్నింటిని అన్ని రోజులు రద్దు చేశారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను 25, 26 తేదీల్లో, కాచిగూడ – రాయిచూర్, మహబూబ్‌నగర్ వెళ్లే రైళ్లను 24, 26 తేదీల్లో రద్దు చేశారు.
కరీంనగర్ – నిజామాబాద్, సిర్పూర్ టౌన్ మధ్య నడిచే రైళ్లను ఈ నెల 26 నుంచి జులై 3వ తేదీ వరకు రద్దు చేశారు. కాజిపేట- డోర్నకల్, భద్రాచలం – విజయవాడ, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, వరంగల్ ప్యాసింజర్లను ఈ నెల 26 నుంచి జులై 2 వరకు రద్దు చేశారు.