టీచ‌ర్‌కు లైంగిక వేధింపులు.. న‌లుగురు విద్యార్థులు అరెస్ట్

Uttar PRadesh | బుద్ధిగా చ‌దువుకోవాల్సిన విద్యార్థులు వికృత చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. క్లాస్ రూంలోనే మ‌హిళా టీచ‌ర్‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేశారు. అంద‌రి ముందు ఐ ల‌వ్ యూ అని చెప్పారు. ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన టీచ‌ర్.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మీర‌ట్ ప‌రిధిలోని రాధ్నా ఇన‌యాత్‌పూర్ గ్రామంలో ఓ ఉన్న‌త పాఠ‌శాల ఉంది. అయితే ఈ పాఠ‌శాల‌లో ప‌ని చేసే […]

టీచ‌ర్‌కు లైంగిక వేధింపులు.. న‌లుగురు విద్యార్థులు అరెస్ట్

Uttar PRadesh | బుద్ధిగా చ‌దువుకోవాల్సిన విద్యార్థులు వికృత చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. క్లాస్ రూంలోనే మ‌హిళా టీచ‌ర్‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేశారు. అంద‌రి ముందు ఐ ల‌వ్ యూ అని చెప్పారు. ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన టీచ‌ర్.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మీర‌ట్ ప‌రిధిలోని రాధ్నా ఇన‌యాత్‌పూర్ గ్రామంలో ఓ ఉన్న‌త పాఠ‌శాల ఉంది. అయితే ఈ పాఠ‌శాల‌లో ప‌ని చేసే ఓ 27 ఏండ్ల మ‌హిళా టీచ‌ర్‌ను న‌లుగురు విద్యార్థులు లైంగికంగా వేధించారు. పాఠాలు చెబుతున్న స‌మ‌యంలో ఆమెను అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో దూషించేవారు. ఆమె విధుల‌కు ఆటంకం క‌లిగించేవారు. ఇక పాఠశాల గ్రౌండ్‌లో విద్యార్థులంద‌రి ముందు ఆ టీచ‌ర్‌కు ఐ ల‌వ్ యూ చెప్పారు. ఈ రెండు వీడియోల‌ను స‌ద‌రు విద్యార్థులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు.

ఈ క్ర‌మంలో టీచ‌ర్ తీవ్ర మ‌న‌స్తాపానికి గురై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. టీచ‌ర్‌ను లైంగికంగా వేధిస్తున్న ఒక అమ్మాయి, మ‌రో ముగ్గురు అబ్బాయిల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 16 ఏండ్ల వ‌య‌సు లోపువారే. దీంతో వారిని జువైన‌ల్ హోమ్‌కు త‌ర‌లించారు.