TGSRTC: 400 మంది ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి!

టీజీఆర్టీసీ సంస్థలోని 400మంది ఉద్యోగులను తొలగించడం పట్ల బాధిత ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమావేశం నిర్వహించిన బాధిత ఉద్యోగులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఎండీ సజ్జనార్ సార్ మాపై పడ్డారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

TGSRTC: 400 మంది ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి!

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ సంస్థలోని 400మంది ఉద్యోగులను తొలగించడం పట్ల బాధిత ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమావేశం నిర్వహించిన బాధిత ఉద్యోగులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఎండీ సజ్జనార్ సార్ మాపై పడ్డారని కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న చిన్న పొరపాట్లకు మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తొలగించి సజ్జనార్ సార్ మా కుటుంబాలను రోడ్డున పడేశారని వాపోయారు.

సంస్థలో మీలాంటి పెద్ధోళ్లు ఎన్నో తప్పులు చేస్తున్నారని.. కానీ మేము ఎదురించదలచుకోలేదన్నారు. మేం ప్రజల మధ్య ఉద్యోగాలు చేసే క్రమంలో రూ.30 రూపాయల టికెట్లు మిస్ అయితే ఉద్యోగాల నుంచి తీసేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మేం చేసిన పొరపాటు మేమేదో బస్సులు కొనడానికి, డిపోలు కొనడానికి చేయలేదన్నారు. సజ్జనార్ సార్ మాకు న్యాయం చేయలేకపోతే తప్పుకోవాలని..సీఎం రేవంత్ రెడ్డి మా గోడు పట్టించుకోవాలని కోరారు. ఉరిశిక్ష వేసే వాళ్లకే క్షమాభిక్ష పెడతారని.. మాక్కూడా ఒక క్షమాభిక్ష అనేది పెట్టాలన్నారు.

ఏడాది నుంచి పోరాడుతున్న మా సమస్య పరిష్కరించడం లేదని నిరంతరం మా వెంట పోలీసులను నిఘా పెడుతున్నారని ఆరోపించారు. భర్తలు లేని వాళ్లు, తల్లిదండ్రులు, అత్త మామలను పోషించే వాళ్లు, పిల్లల చదువులకు ఫీజులు కట్టే వాళ్లు తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ డిపో మహిళా కండక్టర్ ఉద్యోగం కోల్పోవడంతో ఎదురైన కష్టాలను ఏకరువు పెట్టిన తీరు అందరిని కలిచివేసింది.

కాగా సజ్జనార్ అనైతిక, అవినీతి పనులకు పాల్పడుతున్నాడంటూ దేశ ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి, లోకాయుక్త, సెంట్రల్ విజిలెన్స్, రాష్ట్ర ముఖ్యమంత్రికి 9 పేజీల లేఖ రాసినట్లుగా బాధిత ఉద్యోగులు వెల్లడించారు. మమ్మల్ని ఏ విధంగా అయితే ఉద్యోగాల నుంచి తొలగించారో అదే రీతిలో ఆయనపై విచారణ జరిపి ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలని వారు కోరారు.