గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో విషాదం.. ఫుడ్ పాయిజన్ అయ్యి 58 మందికి అస్వస్థత

75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం నెల‌కొన్న‌ది. వేడుక‌ల అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 58 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు

గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో విషాదం.. ఫుడ్ పాయిజన్ అయ్యి 58 మందికి అస్వస్థత
  • పూరీ-సబ్జీ, లడ్డూలు తిన్న
  • చిన్నారుల‌కు వాంతులు, విరేచ‌నాలు
  • మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలోని
  • ప్రభుత్వ పాఠశాలలో దారుణం

విధాత‌: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం నెల‌కొన్న‌ది. వేడుక‌ల అనంతరం ప్రభుత్వ పాఠశాలలో ప‌దార్థాలు తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యి 58 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో శుక్ర‌వారం ఈ దారుణం చోటుచేసుకున్న‌ది. అస్వ‌స్థ‌త‌కు గురైన చాలా మంది విద్యార్థుల ప‌రిస్థి నిలకడగా ఉన్న‌ద‌ని, ఒక బాలికను ప్రభుత్వ ద‌వాఖాన‌లో చేర్పించామ‌ని అధికారులు తెలిపారు.

సిర్మౌర్ ప్రాంతంలోని పెదరిలో ఉన్న పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం చిన్నారులకు పూరీ-సబ్జీ, లడ్డూలు అందించినట్టు జిల్లా ప్రధాన వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (సీఎంహెచ్‌వో) డాక్టర్‌ కేఎల్‌ నామ్‌దేవో తెలిపారు. వారిలో చాలా మంది విద్యార్థులు, వాంతులు, విరేచ‌నాలు చేసుకున్నారు.

చిన్నారులను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలికలలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో, ఆమెను రేవాలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ మెమోరియల్ ద‌వాఖాన‌కు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్న‌ట్టు డాక్టర్ నామ్‌డియో తెలిపారు. మిగిలిన పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. మెరుగైన చికిత్స అందించడానికి కుషా భావు ఠాక్రే జిల్లా ద‌వాఖాన‌, ప్రభుత్వ శ్యామ్ షా మెడికల్ కాలేజీ వైద్యుల బృందాన్నిపిలిపించారు.