కొన్ని జీవితాలంతే: 5 కోట్ల విలువ చేసే ఇల్లున్నా.. ఫుట్‌పాతే మకాం!

విధాత: లండ‌న్‌కు చెందిన డోమ్‌ది మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు సంప్రదాయ విలువలతో జీవించే సగటు జీవులు. డోమ్‌కు చదువు అబ్బలేదు. కానీ ఆటలు, అథ్లెటిక్స్‌లో ముందు భాగాన ఉంటాడు. దాంతో అతనికి స్టైఫండ్‌ వచ్చేది. వచ్చిన ఆ స్టైఫండ్‌తో డోమ్‌ జల్సాలు చేయసాగాడు. 13ఏండ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడే అతినికి సిగరెట్లు, మద్యం అలవాటయ్యాయి. 17ఏండ్లు వచ్చే నాటికే డ్రగ్స్‌ తీసుకోసాగాడు. అందులో హెరాయిన్‌ లాంటి ప్రమాదకరమైన డ్రగ్‌కు బానిసయ్యాడు. యవ్వన వయస్సు నాటికే సమాజంలో ఉన్న చెడ్డ […]

  • By: krs    latest    Dec 03, 2022 10:10 AM IST
కొన్ని జీవితాలంతే: 5 కోట్ల విలువ చేసే ఇల్లున్నా.. ఫుట్‌పాతే మకాం!

విధాత: లండ‌న్‌కు చెందిన డోమ్‌ది మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు సంప్రదాయ విలువలతో జీవించే సగటు జీవులు. డోమ్‌కు చదువు అబ్బలేదు. కానీ ఆటలు, అథ్లెటిక్స్‌లో ముందు భాగాన ఉంటాడు. దాంతో అతనికి స్టైఫండ్‌ వచ్చేది. వచ్చిన ఆ స్టైఫండ్‌తో డోమ్‌ జల్సాలు చేయసాగాడు. 13ఏండ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడే అతినికి సిగరెట్లు, మద్యం అలవాటయ్యాయి. 17ఏండ్లు వచ్చే నాటికే డ్రగ్స్‌ తీసుకోసాగాడు. అందులో హెరాయిన్‌ లాంటి ప్రమాదకరమైన డ్రగ్‌కు బానిసయ్యాడు.

యవ్వన వయస్సు నాటికే సమాజంలో ఉన్న చెడ్డ అలవాట్లన్నీ అలవడ్డాయి. కొడుకును మంచివాడుగా తీర్చిదిద్దాలన్న ఆశలు నెవరవేరవని గ్రహించిన డోమ్‌ తల్లిదండ్రులు అతనికి ఐదు కోట్ల విలువ చేసే ఓ ఇంటిని కొనిచ్చారు. జీవితంలో స్థిరపడక పోయినా ఇంటి అద్దెపై ఆధారపడైనా జీవిస్తాడని వారి ఆశ.

అయితే వ్యసనపరుడైన డోమ్‌కు అథ్లెటిక్‌గా వచ్చే స్టైఫండ్‌ సరిపోకపొయ్యేది. దాంతో ఆయన బిచ్చ మెత్తుకొని వచ్చే డబ్బుతో వ్యసనాలు తీర్చుకొనేవాడు. అలా బిచ్చమెత్తుకొని రోజుకు రెండు నుంచి మూడొందల డాలర్లు సంపాదిస్తూ.. ఫుట్‌పాత్ మీదే పడుకొని జీవితం వెల్లదీస్తున్నాడు.

ఎందుకంటే ఇంటిని అద్దెకిచ్చి వచ్చిన దాంతో వ్యసనాలు తీర్చుకోవచ్చని అతని లెక్క. ఇంటి అద్దె కూడా 1.27లక్షలు వస్తుంది. దీంతో రోజంతా మత్తులో జోగుతాడు డోమ్‌. ఆఖరుగా కొసమెరుపు ఏంటంటే జీవిత చరమాంకానికి చేరువవుతున్న తాను ఇకనుంచి వ్యసనాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడట.