MlC ELECTION: AP పట్టభద్రుల MLC పోలింగ్‌లో వింత..! ఓటేసిన 6, 7 తరగతి బోగస్ ఓటర్లు..!
విధాత: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి సంబంధించి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC) స్థానాలకు, రెండు ఉపాధ్యాయ(Teacher) ఎమ్మెల్సీ స్థానాలకు, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (MLC of local bodies) స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్‌లో తీవ్ర స్థాయిలో అక్రమాలు, వింతలు చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) నియోజకవర్గాల్లో బోగస్ ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేయడం వింతగా మారింది. పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరిన ఓటర్లను మీడియా ప్రతినిధులు విచారించగా […]

విధాత: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి సంబంధించి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC) స్థానాలకు, రెండు ఉపాధ్యాయ(Teacher) ఎమ్మెల్సీ స్థానాలకు, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (MLC of local bodies) స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్‌లో తీవ్ర స్థాయిలో అక్రమాలు, వింతలు చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) నియోజకవర్గాల్లో బోగస్ ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేయడం వింతగా మారింది.
పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరిన ఓటర్లను మీడియా ప్రతినిధులు విచారించగా 6, 7, 9, 10 తరగతులు చదివిన మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం అందరిని విస్మయపరిచింది. వారిని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తూ మీరు ఏమి చదివారని ప్రశ్నించగా తాము 6, 7, 9, 10 తరగతులను చదివామని, తమకు ఓటు స్లిప్పులు ఇచ్చి మీకు ఓటు ఉందని, ఓటు వేయాలని చెప్పారని, అందుకు డబ్బులు కూడా ఇచ్చారని అందుకే ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్‌కు వచ్చామంటూ అమాయకంగా చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లు ఓటు వేసిన తీరుతో ఎన్నికల ప్రక్రియ అంతా అపహస్యంగా మారిపోయింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడుతో పాటు బిజెపి, జనసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
పట్టభద్రుల ఓటర్ల జాబితాలో బోగస్ ఓటర్లను, నకిలీ సర్టిఫికెట్ల పట్టభద్రులను చేర్చడంతో పాటు సామాన్య ఓటర్లకు డబ్బులు ఇచ్చి, ఓటు స్లిప్పులు అందించి పోలింగ్ స్టేషన్లకు తీసుకొచ్చి వైసీపీ వారు ఓట్లు వేయించి ఎన్నికల్లో గెలవాలనుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు.
మండలి ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయించడం ఎన్నికల వ్యవస్థను పూర్తిగా అపహాస్యం చేసినట్లు అయిందన్నారు. ఒకవైపు బోగస్ ఓట్లు, మరో వైపు ఓటుకు 3 నుంచి 5000 చొప్పున ఓట్ల కొనుగోలుతో ఏపీలో శాసనమండలి ఎన్నికలు వివాదాస్పదమయ్యాయి.
సోమవారం శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం, అలాగే ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు, మరొకటి కడప- అనంతపురం- కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మూడింటికి పోలింగ్ జరిగింది. ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు, అలాగే కడప-అనంతపురం- కర్నూలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికి, పశ్చిమగోదావరిలో రెండు, శ్రీకాకుళం, కర్నూల్‌లో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలలో ఐదు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
అటు తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 90. 40% పోలింగ్ నమోదయింది. ఎన్నికల బరిలో 21 మంది ఉన్నారు. ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. బ్యాలెట్ బాక్స్ లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు.