అమెరికాలో పేలిన తుటా.. ఎనిమిది మందిని కాల్చి చంపిన సాయుధుడు..!

అగ్రరాజ్యంలో అమెరికాలో కాల్పుల మోత మోగింది. చికాగోలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మృతి చెందారని ఇల్లినాయిస్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు.

అమెరికాలో పేలిన తుటా.. ఎనిమిది మందిని కాల్చి చంపిన సాయుధుడు..!

Chicago | అగ్రరాజ్యంలో అమెరికాలో కాల్పుల మోత మోగింది. చికాగోలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మృతి చెందారని ఇల్లినాయిస్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు. జోలియెట్‌, విల్‌కౌంటీలో వేర్వేరుగా ఆది, సోమవారాల్లో నిందితుడు కాల్పులు జరిపారు. విల్‌కౌంటీలోని ఓ ఇంట్లో ఒకరు. జోలియన్‌లోని రెండు ఇండ్లలో ఏడుగురు మృతి చెందారు. నిందితుడిని నిందితుడిని రోమియో నాన్స్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నట్లు పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ కాల్పులకు తెగబడానికి కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.


అయితే, మృతులకు, నిందితుడికి ఏవైనా సంబంధాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు ఎరుపు రంగు టయోటా కారులో తప్పించుకు తిరుగుతున్నట్లుగా తెలిపారు. నిందితుడికి సంబంధించిన ఫొటోలును విడుదల చేసి.. అతని గురించి ఏవైనా సమాచారం ఉంటే చెప్పాలని జోలియట్ పోలీస్ చీఫ్ విలియం ఎవాన్స్ కోరారు. అయితే, మొదట విల్‌కౌంటీలో ఆదివారం ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారని.. ఆ తర్వాత జోలియట్‌లోని మరో రెండు ఇండ్లలో ఏడుగురు మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.