యూపీలో భారీ వర్షాలు.. గోడ కూలి ఏడుగురు మృతి
విధాత : గత 24 గంటల నుంచి ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు కృపాల్‌పూర్, చంద్రపురా గ్రామాల్లో ఇండ్ల గోడలు కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి చంద్రపురా గ్రామంలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన చిన్నారులు పదేండ్ల వయసులోపు వారే. కృపాల్‌పూర్ గ్రామంలో వృద్ధ […]

విధాత : గత 24 గంటల నుంచి ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు కృపాల్‌పూర్, చంద్రపురా గ్రామాల్లో ఇండ్ల గోడలు కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి చంద్రపురా గ్రామంలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన చిన్నారులు పదేండ్ల వయసులోపు వారే.
కృపాల్‌పూర్ గ్రామంలో వృద్ధ దంపతులు రామ్ సనేహి(65), రేష్మా దేవీ(62) మృతి చెందారు. వీరి నివాసం పెట్రోల్ బంక్ గ్రౌండ్‌కు అనుకొని ఉంది. భారీ వర్షాల కారణంగా ఆ ఇంటి గోడ కూలిపోయింది. బంగ్లాన్ గ్రామంలోనూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని జబర్ సింగ్(35)గా పోలీసులు గుర్తించారు.