ఏడుగురు కేంద్ర మంత్రుల‌కు బీజేపీ మొండిచేయి

ఏప్రిల్‌లో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఏడుగురు కేంద్ర మంత్రులను అధికార బీజేపీ తిరిగి నామినేట్ చేయ‌డం లేదు. అదే నెలాఖరులో జ‌రిగే లోక్‌సభ ఎన్నికల బ‌రి వారిని నిల‌పాల‌ని పార్టీ అధిష్ఠానం భావిస్తున్న‌ట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏడుగురు కేంద్ర మంత్రుల‌కు బీజేపీ మొండిచేయి
  • రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయ‌ని అధిష్ఠానం
  • లోక్‌సభ ఎన్నికల బ‌రిలో నిల‌పాల‌ని యోచ‌న‌


విధాత‌: ఏప్రిల్‌లో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఏడుగురు కేంద్ర మంత్రులను అధికార బీజేపీ తిరిగి నామినేట్ చేయ‌డం లేదు. అదే నెలాఖరులో జ‌రిగే లోక్‌సభ ఎన్నికల బ‌రి వారిని నిల‌పాల‌ని పార్టీ అధిష్ఠానం భావిస్తున్న‌ట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


ఏప్రిల్‌లో రాజ్య‌స‌భ ప‌ద‌వికాలం ముగియ‌నున్న కేంద్ర మంత్రుల్లో.. ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (గుజరాత్), విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (మధ్యప్రదేశ్), జూనియ‌ర్ ఐటీ స‌హాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక), పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (రాజస్థాన్), మత్స్య శాఖ‌మంత్రి పర్షోత్తమ్ రూపాలా (గుజరాత్), మైక్రో, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే, జూనియ‌ర్ విదేశాంగ మంత్రి (మహారాష్ట్ర) ఉన్నారు. ఈ ఏడుగురు వివిధ రాష్ట్రాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగవచ్చని బీజేపీ వర్గాలు తెలిపాయి.


ధ‌ర్మేంద్ర ప్రధాన్ తన సొంత రాష్ట్రం ఒడిశాలోని సంబల్‌పూర్ లేదా ధేక్నాల్ నుండి పోటీ చేయవచ్చని బీజేపీవ‌ర్గాలు తెలిపాయి. భూపేంద‌ర్ యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ లేదా మహేంద్రగఢ్ నుంచి పోటీ చేయవచ్చు. చంద్రశేఖర్.. బెంగళూరులోని నాలుగు స్థానాల్లో ఒకదాని నుంచి పోటీ చేయవచ్చు. అలాగే మాండవ్య గుజరాత్‌లోని భావ్‌నగర్ లేదా సూరత్ నుంచి బ‌రిలో ఉంటారు. రూపాలా రాజ్‌కోట్ నుంచి పోటీ చేయ‌వ‌చ్చు. మురళీధరన్ సొంత రాష్ట్రం కేరళ నుంచి బ‌రిలో నిలిచే అవ‌కాశం ఉన్న‌ది.