ఆమెకు 70 ఏండ్ల వయసు. ఆ వయసులోనూ ఆ వృద్ధురాలు తల్లైంది. కవల పిల్లలకు జన్మనిచ్చింది.
విధాత: ఆమెకు 70 ఏండ్ల వయసు. ఆ వయసులోనూ ఆ వృద్ధురాలు తల్లైంది. కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం 40 ఏండ్లు నిండిన మహిళలు పిల్లల్ని కనడం కష్టంగా మారింది. కానీ ఈ వృద్ధురాలు 70 ఏండ్ల వయసులో కవలలకు జన్మనివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది.
ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ వయసు ప్రస్తుతం 70 ఏళ్లు. ఐవీఎఫ్ ద్వారా ఆమె తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. కంపాలా నగరంలోని ఓ హాస్పిటల్లో బుధవారం ఆమెకు సిజేరియన్ ద్వారా బాబు, పాప పుట్టారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐవీఎఫ్ చికిత్స ద్వారా ఆమెకు కవలలు జన్మించినట్లు డాక్టర్లు వెల్లడించారు.
2020లోనూ సఫీనా ఐవీఎఫ్ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది. అయితే ఆమెకు మొదట 1992లో వివాహమైంది. కానీ పిల్లలు పుట్టలేదు. కొంతకాలానికి భర్త చనిపోయాడు. 1996లో సఫీనా నముక్వాయా రెండో వివాహం చేసుకుంది.