బాలీవుడ్ స్టార్ ఇంట్లో 80‘s తారల పార్టీ.. దుమ్ము దులిపేశారు?
విధాత: 80స్ తారలంతా ఏడాదికి ఒకసారి గెట్ టు గెదర్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారనే విషయం తెలియంది కాదు. కరోనా సమయంలో కూడా వారీ వేడుకను మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ ఏడాది ఈ రీయూనియన్ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ ఆతిథ్యమిచ్చారు. ముంబైలో జాకీష్రాఫ్ ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు సౌత్ సెలబ్రిటీలే కాకుండా బాలీవుడ్‌కి చెందిన కొందరు నటీనటులు కూడా హాజరయ్యారు. చిరంజీవి, వెంకటేష్, అర్జున్, రమ్యకృష్ణ, విద్యాబాలన్, ఖుష్బూ, సుహాసిని, […]

విధాత: 80స్ తారలంతా ఏడాదికి ఒకసారి గెట్ టు గెదర్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారనే విషయం తెలియంది కాదు. కరోనా సమయంలో కూడా వారీ వేడుకను మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ ఏడాది ఈ రీయూనియన్ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ ఆతిథ్యమిచ్చారు.
ముంబైలో జాకీష్రాఫ్ ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు సౌత్ సెలబ్రిటీలే కాకుండా బాలీవుడ్‌కి చెందిన కొందరు నటీనటులు కూడా హాజరయ్యారు. చిరంజీవి, వెంకటేష్, అర్జున్, రమ్యకృష్ణ, విద్యాబాలన్, ఖుష్బూ, సుహాసిని, సుమలత, జయప్రద, మధుబాల, అంబిక, లిజీ, రేవతి, రాధ, శోభన, సుమలత, అనుపమ్ ఖేర్, శరత్‌కుమార్, నరేశ్, అనిల్ కపూర్, భాను చందర్, నదియ, సరిత ఇలా దాదాపు 30 మందికి పైగా సెలబ్రిటీలు ఈ రీయూనియన్‌లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈసారి ఈ వేడుకలకు రజనీకాంత్, కమల్ హాసన్, బాలయ్య వంటివారు దూరంగా ఉన్నారు. వారీ వేడుకలలో ఎక్కడా కనిపించలేదు. ఇక ఈ వేడుకలో సెలబ్రిటీలందరూ యమా ఎంజాయ్ చేసినట్లుగా.. విడుదలైన కొన్ని వీడియోలను చూస్తుంటే తెలుస్తుంది. సుమలత పాట పాడుతుంటే.. సుహాసిని, అర్జున్ వంటి వారు డ్యాన్స్‌లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో అయితే.. మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ డ్యాన్స్‌తో కెమిస్ట్రీ ఇరగదీసినట్లుగా కనిపిస్తుంది. అనంతరం అంతా కలిసి ఎప్పటిలానే గ్రూపు ఫొటోలు దిగి.. వాటిని షేర్ చేశారు.ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 80స్ బ్యాచ్‌కి ఇది 11వ రీయూనియన్. నిజంగా ఇదొక గొప్ప థాట్‌గా ఇతర ఇండస్ట్రీలకు చెందిన వారు కూడా.. దీనిపై మాట్లాడుకుంటుండటం గమనార్హం.